cloudfront

Advertisement


Home > Politics - Political News

మరో స్కామ్ లో టీడీపీ.. పార్టీ ఫండ్ కోసం వేధింపులు!

మరో స్కామ్ లో టీడీపీ.. పార్టీ ఫండ్ కోసం వేధింపులు!

ఇప్పటికే తెలుగుదేశం చాలా స్కామ్స్ లో చిక్కుబడింది. ఈ సారి ఓడిపోతే తెలుగుదేశం పార్టీకి చాలా విషయాలకు ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంది. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం వారు చేయని స్కామ్ అంటూ లేదనే మాట వినిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రత్యర్థులకు అధికారం దక్కడం ఖాయమనే నేపథ్యంలో తెలుగుదేశం కూసాలు కదులుతాయనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.

ఫలితాలకు మరికాస్త సమయం ఉంది. అయితే ఈలోపు కూడా తెలుగుదేశం వాళ్లు ఖాళీగా ఉండేలా లేరు. ఎన్నికల పోలింగ్ అయిపోయాకా కూడా వీళ్లు పార్టీ ఫండ్స్ అంటూ కొంతమందిని వేధిస్తున్న దాఖలాలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడే తనను తమ వాళ్లు పార్టీ ఫండ్ కోసం వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్ లో ఈ మేరకు వీరపనేని రవికాంత్ ఫిర్యాదు చేశారు. ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వమంటూ తనను తెలుగుదేశం వాళ్లు వేధిస్తూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడినే కానీ, అంత డబ్బు తనవద్ద లేదని, తను ఇచ్చుకోలేనని చెప్పినా వారు వినడం లేదని, తనను వేటాడి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రవికాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

చంద్రబాబు పేరు చెప్పే తనను డబ్బులు అడుగుతున్నారని, ఈసారి ఎన్నికలకు శ్రీ చైతన్య వాళ్లు పార్టీ ఫండ్ ఇవ్వలేదని, వారు ఐదువందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందని, వాళ్లు ఇవ్వకపోవడంతో బాబు ఇబ్బందిలో పడ్డారని.. అందుకే తమలాంటి వారి నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని అంటూ తన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని రవికాంత్ వాపోయారు.

చంద్రబాబు నాయుడు కార్యాలయం ఫోన్ల నుంచినే తనకు కాల్ చేసి ఎనిమిదికోట్లు ఇవ్వమంటూ వేధిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. 

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!