cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు లేదు.. బొక్క లేదు.. టీడీపీ లైట్

బాబు లేదు.. బొక్క లేదు.. టీడీపీ లైట్

మొన్నటికిమొన్న పార్టీ లేదు.. బొక్క లేదు అన్నారు స్వయానా ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. ఇప్పుడు అదే పద్ధతిని మొత్తం టీడీపీ నేతలు ఫాలో అవుతున్నారు. 

తమ అధినేత చంద్రబాబుపై విపక్ష నేతలు విమర్శలు చేస్తుంటే లైట్ తీసుకుంటున్నారు. మీరు స్పందించరా అని అడిగితే బాబు లేదు..బొక్క లేదు అనే అర్థం వచ్చేలా మొహం అదోలా పెడుతున్నారు. ఈ వ్యవహారశైలి పార్టీలో ఎప్పట్నుంచో ఉంది. కాకపోతే ముద్రగడ లేఖతో కొట్టొచ్చినట్ట కనిపించింది.

టీడీపీలో కాపు నాయకులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్లలో ఒక్కరు కూడా ముద్రగడ లేఖపై గట్టిగా స్పందించలేదు. బాబుకు మద్దతుగా మాట్లాడలేదు. గంటా శ్రీనివాసరావు, నారాయణ, బోండా ఉమ, నిమ్మల రామానాయుడు ఏమయ్యారు వీళ్లంతా? ముద్రగడ లేఖ రాసి మరీ బాహాటంగా బాబుపై విమర్శలు చేస్తుంటే.. వీళ్లు మాట్లాడరెందుకు? కేవలం చినరాజప్ప మాత్రమే ఈ వ్యవహారంపై స్పందించి మమ అనిపించారు.

చంద్రబాబు కుల రాజకీయాల్ని ఆ పార్టీలోని ఇతర సామాజిక వర్గాల నేతలు బాగానే అర్థం చేసుకున్నారు. కేవలం తిట్టడానికి, తిట్టించుకోడానికి మాత్రమే ఇతర సామాజిక వర్గాల నేతల్ని చంద్రబాబు వాడుకుంటారని, ఒకరికో ఇద్దరికో రిజర్వేషన్ల ప్రకారం పదవులిచ్చి సంతోష పెడతారనే వాదన ఎప్పటినుంచో ఉంది. అదిప్పుడు పూర్తిగా బయటపడింది.

వాస్తవానికి ముద్రగడ లేఖ తర్వాత చంద్రబాబుకి మద్దతుగా కనీసం ఆ పార్టీలోని కాపు నేతలైనా సౌండ్ పెంచుతారని అనుకున్నారంతా. ముద్రగడను బాబు ఇబ్బంది పెట్టలేదని, ఆయనకు కాపులంటే చాలా ప్రేమ అని, తామంతా ఆయన నీడలో చల్లగా ఉన్నామని చెబుతారని అంచనా వేశారు. కానీ చినరాజప్ప మినహా ఇంకెవరూ చంద్రబాబుకి మద్దతు తెలపలేదు.

తమ సామాజిక వర్గంలో ముద్రగడకు ఉన్న క్లీన్ ఇమేజ్ ని చెరిపేయాలనుకోలేదు. అదే సమయంలో కాపులకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని కూడా ఇలా సైలెంట్ గా హైలెట్ చేయాలనుకున్నారు.

నిజానికి 'గంట' మోగితే బాగుండేది..!

నిజానికి గంటా శ్రీనివాసరావుకు ఇదొక మంచి అవకాశం. ముద్రగడపై విరుచుకుపడి అటు స్వామిభక్తిని చాటుకోవడంతో పాటు.. ఇటు తన వర్గానికి మరింత దగ్గరవ్వొచ్చు. పనిలోపనిగా తను టీడీపీలోనే ఉన్నానంటూ సంకేతాలు ఇవ్వొచ్చు. కానీ గంటా ఆ పని చేయలేదు. 

ఆయన మౌనంగా ఉంటూ, ముద్రగడ లేఖలోని అంశాలన్నీ నిజమే అని పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది. అయినా, చంద్రబాబు ఏడ్చినప్పుడే రియాక్ట్ అవ్వని గంటా, ముద్రగడ లేఖపై స్పందిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది.

ఆమధ్య చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చినా కూడా కుటుంబం అండగా ఉంది కానీ, పార్టీ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. పార్టీయే నా కుటుంబం అని చెప్పుకునే చంద్రబాబుకి ఇది నిజంగా షాకింగ్. పార్టీలో కీలక నేతలెవరూ చంద్రబాబు ఏడుపు గురించి రచ్చ చేయలేదు,

కార్యకర్తలు ధర్నాలకు దిగలేదు. కనీసం పట్టాభి ఎపిసోడ్ కి వచ్చిన స్పందన కూడా రాలేదంటే బాబు ఏడుపు ఎంతమందిని లోలోపల సంతోష పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం టీడీపీలో ఒకటే ధోరణి.. పార్టీ లేదు, బొక్కా లేదు, అసలు బాబే లేడు. 

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!