cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారా...?

తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారా...?

అదేంటో మంచి చేస్తే కూడా తెలుగు తమ్ముళ్ళకు  మంటగా ఉంటోందని వైసీపీ నేతలు అంటున్నారంటే దానిలో వింతా విడ్డూరం ఏముంది. కనుమ పండుగ శుభ‌ వేళ  పశువులకు పూజ చేయాలి. 

ముఖ్యమంత్రి హోదాలో జగన్  గుంటూరులో జరిగిన‌ గో పూజలో పాలుపంచుకున్నారు. ఏపీవ్యాప్తంగా వేలాదిగా ఉన్న  ఆలయాలలో  గో పూజ వైభవంగా జరిగింది.

అంతే దీని మీద ఒకరి తరువాత ఒకరుగా తమ్ముళ్ళు హాట్ కామెంట్స్ చేస్తూ తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. జగన్ ది దిగజారుడు రాజకీయమని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఏకంగా అతి పెద్ద బండనే వేశారు. 

ఆఖరుకు ఆవులతో  కూడా జగన్ రాజకీయం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో విగ్రహాలు ద్వంశం అవుతూంటే పట్టని సర్కార్ గో పూజ పేరిట రాజకీయాలకు తెర తీసిందని అంటున్నారు.

ఇదే తీరున బోండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య వంటి వారు వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తూంటే వైసీపీ నేతలు కూడా గట్టిగానే రిటార్ట్ ఇస్తున్నారు. ఏపీలో మంచి జరుగుతూంటే తమ్ముళ్లకు తట్టుకోవడం కష్టంగానే ఉందని అంటున్నారు.

నిజానికి దిగజారుడు రాజకీయాలు ఎవరివి అని కనుక చూస్తే రాముడు విగ్రహం ఇలా ద్వంశం కాగానే అలా రామతీర్ధానికి వచ్చి వాలిపోయిన రాజకీయ నేతలదా, లేక కూల్చివేసిన ఆలయాలను తిరిగి నిర్మిస్తున్న జగన్ దా అని కూడా ప్రశ్నిస్తున్నారు. 

మొత్తానికి హిందూ కార్డు తో ఏదో చేద్దామనుకున్న విపక్షాలకు జగన్ సమ ధర్మ భావన  సహించలేనిదిగా ఉందని విశ్లేషిస్తున్నారు. 

న‌వ్విపోదురు గాక‌..మాకేటి సిగ్గు

మంచి కిక్‌ ఇచ్చారు

 


×