Advertisement

Advertisement


Home > Politics - Political News

ఈ పసుపు గాలి ఎటువైపు?

ఈ పసుపు గాలి ఎటువైపు?

రాష్ట్రంలో మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం గట్టిగా వినిపిస్తోంది. అయితే ముహూర్తాలు మారుతున్నాయి కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యే తమ్ముళ్ళు మాత్రం ఆ ఆకర్ష్ మంత్రానికి ముగ్దులైపోతున్నారని కూడా ప్రచారం సాగుతోంది.

ఇల్లా ఆకర్ష్ వలలో చిక్కుకునే వారి జాబితా ఇదీ అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఆ జాబితాలో గుంటూర్, ప్రకాశం జిల్లాల తరువాత విశాఖ జిల్లా పేరు కూడా వినిపిస్తోంది. మరి విశాఖ అర్బన్ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున గెలిచారు. ఇందులో ఎంతమంది గీత దాటుతారు, సైకిల్ దిగుతారు అన్నది గత ఏడాదిగా ఎపుడూ చర్చగానే ఉంది.

అయితే ఎప్పటికపుడు అంతా సర్దుకుంటున్నారు. కానీ ఈసారి ఆపరేషన్ మంత్రం గట్టిగానే వినిపిస్తోంది. తమ్ముళ్ళ  మదిలో అలజడి రేపేలా ఉందని కూడా అంటున్నారు. మరి టీడీపీకి ఉత్తరాంధ్రా జిల్లాల్లో ఊపు తెచ్చి ఏకంగా నాలుగు దిక్కులా పచ్చ పార్టీని గెలిపించిన రికార్డు ఉంది. దాన్ని ఉల్టా చేసి తమ్ముళ్ళు ఎవరైన గోడ దూకుతారా అన్నది హాట్ హాట్ చర్చ.

మరో వైపు వైసీపీ పెద్ద తలకాయలు అయితే ఎవరినీ తాము తీసుకోబోమని అంటున్నా కూడా తెరవెనక కసరత్తులు, కదలికలు వేరే అర్ధాలు చెబుతున్నాయి. ఈ రకంగా చూసుకుంటే మాత్రం విశాఖ టీడీపీలో ఏదో జరుగుతోంది  అనిపించక మానదు, అదే కనుక జరిగితే మాత్రం పచ్చ పార్టీలో బిగ్ బ్లాస్ట్ అదేనని చెప్పాలేమో.

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?