cloudfront

Advertisement


Home > Politics - Political News

కోటీశ్వరుల్లో టీడీపీదే నంబర్ వన్ ప్లేస్!

కోటీశ్వరుల్లో టీడీపీదే నంబర్ వన్ ప్లేస్!

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో మొత్తంగా 30శాతం మంది కోటీశ్వరులు అని తెలుస్తోంది. ఆఖరి విడత పోలింగ్ కు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఆస్తుల చిట్టాలను పరిశీలిస్తే కనీసం కోటి రూపాయలకు పై స్థాయిలో ఆస్తులను డిక్లేర్డ్ చేసిన వారి సంఖ్య 30శాతం మంది. అన్ని పార్టీల తరఫు నుంచి నామినేషన్లు వేసినవారు, ఇండిపెండెంట్లనూ అందరినీ కలుపుకుంటే.. ముప్పైశాతం కోటీశ్వరులు ఉన్నారని తెలుతోంది.

అయితే ప్రధాన పార్టీ వారీగా చూస్తే కోటీశ్వరులు అయిన ఎంపీ అభ్యర్థుల సంఖ్య మరింత గణనీయంగా ఉంటుంది. ఇండిపెండెంట్స్ గా  కొందరు అనామకులు పోటీలో ఉంటారు. దీంతో ఎంపీ అభ్యర్థుల్లో కోటీశ్వరుల శాతం తక్కువగా ఉంటుంది. అదే ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయానికి వస్తే.. ఈ శాతం భారీగా పెరుగుతోంది.

ముందుగా ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే.. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అందరూ కోటీశ్వరులే! 25 ఎంపీ సీట్లకు ఈ పార్టీ పోటీచేసింది. అన్ని స్థానాలకూ కోటీశ్వరులనే పోటీలో పెట్టింది టీడీపీ! వీరిలో కొందరు వందల కోట్ల రూపాయలకు అధిపతులు కూడా ఉన్నారు.

ఇలా వందశాతం కోటీశ్వరులనే బరిలోకి దించిన పార్టీల్లో తెలుగుదేశం, శిరోమణి అకాళీదల్, అన్నాడీఎంకేలున్నాయి. ఈ పార్టీల తరఫున పోటీచేసిన అభ్యర్థులందరికీ కనీసం కోటి రూపాయలకు పైనే ఆస్తులున్నాయి. కొందరి ఆస్తులు వందల కోట్ల రూపాయల స్థాయిలో ఉన్నాయి.

డీఓంకే 96 శాతం మంది కోటీశ్వరులను బరిలోకి దించింది. ఆర్జేడీ అభ్యర్థుల్లో 90శాతం మంది కోటీశ్వరులు కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో 88శాతం మంది కోటీశ్వరులున్నారు. ప్రధాన జాతీయ పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్ లు దాదాపు సమస్థాయిలో కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చాయి.

బీజేపీ తరఫున 83.4శాతం మంది కోటీశ్వరులు కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల్లో 83.1శాతం మంది కోటీశ్వరులు. పెద్ద తేడా ఏమీలేనట్టే. తక్కుమంది కోటీశ్వరులున్న పెద్దపార్టీగా బీఎస్పీ నిలుస్తోంది. ఆ పార్టీ తరఫున కేవలం 33.8శాతం మంది మాత్రమే కోటీశ్వరులున్నారు.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!