cloudfront

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబుకు చివరికి ఆ మిగిలింది ఆ 23 మంది!

చంద్రబాబుకు చివరికి ఆ మిగిలింది ఆ 23 మంది!

'దేవుడనే వాడున్నాడు..' అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తరచూ చెప్పినమాట. దేవుడు చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నారు.. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారు.. అంటూ గత ఐదేళ్లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలాసార్లు చెబుతూ వచ్చారు. ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. 'దేవుడి ఆశ్వీర్వాదంతో, ప్రజల తీర్పుతో గెలిచాం..' అని జగన్ కూడా ప్రకటించారు. ఈ తీర్పును చూస్తే  ఆశ్చర్యకరమైన నంబర్ ఒకటి ఉంది. అదే తెలుగుదేశం పార్టీకి దక్కిన ఎమ్మెల్యే సీట్ల సంఖ్య!

కచ్చితంగా 23 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి తెలుగుదేశం పార్టీకి. ఈ నంబర్ ను వింటే.. మరో నంబర్ గుర్తుకు వస్తుంది. అదే గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు చేర్చుకున్న ఎమ్మెల్యే సంఖ్య. చేర్చుకోవడం అనడంకంటే.. కొనుక్కోవడం అనడం కరెక్టు!

కోట్ల రూపాయల డబ్బు, కాంట్రాక్టులు, అధికారం.. అనేవాటిని ఉపయోగించి ఆ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుక్కొన్నారు. అలా చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 23. అలా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తన అధికార కాంక్షను చాటారు చంద్రబాబు నాయుడు. ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నట్టే అని తన అనుకూల మీడియాతో రాయించుకున్నారు.

దేవుడు చూస్తూ వచ్చాడు.. ప్రజలూ గమనించారు.. ప్రజలు తెలుగుదేశం పార్టీని చిత్తుకింద కొడితే, ఆ పార్టీకి కచ్చితంగా 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే మిగిలాయి! చంద్రబాబు నాయుడు ముచ్చటపడి కొనుక్కొన్న ఎమ్మెల్యేలు ఎంతమందో.. చివరకు అంతేమంది ఆ పార్టీకి మిగిలారు! ఇందుమూలంగా అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటో చంద్రబాబుకే బాగా అర్థమై ఉండాలి ఈ పాటికి!