Advertisement

Advertisement


Home > Politics - Political News

రివర్స్ అయిన సెటైర్.. టీడీపీ సెల్ఫ్ గోల్

రివర్స్ అయిన సెటైర్.. టీడీపీ సెల్ఫ్ గోల్

వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే దమ్ములేక, విమర్శించేందుకు సబ్జెక్ట్ లేక.. అభ్యర్థి గురుమూర్తిని టార్గెట్ చేస్తోంది టీడీపీ. సీఎం జగన్ కి వ్యక్తిగతంగా సేవ చేసినందుకు ప్రతిఫలంగా టికెట్ పొందారని, ఆయనకు ఆ అర్హత లేదని చెబుతూ వస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ ని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణని కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకున్నారంటే ప్రతిపక్షాల దివాళాకోరుతనానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది. చివరికి వకీల్ సాబ్ బెనిఫిట్ షోస్ కి, తిరుపతి ఉప ఎన్నికలకు ముడిపెట్టి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మాట్లాడారంటే.. వేరే గత్యంతరం లేక జగన్ పైకి పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారనే అనుకోవాలి.

గురుమూర్తి చేసిన తప్పేంటి..? బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కి రాజకీయ నేపథ్యం లేదు. టీడీపీ రాజకీయ క్రీడను ధిక్కరించి నిలబడ్డ తెగువ చూసి, జగన్ ఆయనకు సీటిచ్చారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నేపథ్యం ఏంటి? ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎదురొడ్డి నిలబడే శక్తి సామర్థ్యాలను చూసి జగన్ ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. 

తిరుపతి ఉప ఎన్నికల్లో గురుమూర్తికి టికెట్ ఇవ్వడానికి కావాల్సిన అర్హత ఏంటి? ఎప్పుడూ తనవెంట మెడికల్ కిట్ ఉంచుకుని.. ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా పేదవారికి సాయం చేసే మానవతా గుణం ఉంది కనుకనే ఆయనకు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు సీఎం జగన్.

అయితే కేవలం పాదయాత్రలో జగన్ కి సేవ చేసిన విషయాన్ని మాత్రమే హైలెట్ చేస్తూ పదే పదే గురుమూర్తిని కించపరుస్తోంది టీడీపీ. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు గురుమూర్తి పట్టుకున్నట్టు ఓ ఫొటో క్రియేట్ చేసి వదిలారు. అది కాస్తా ఇప్పుడు రివర్స్ అయింది, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. వెంటనే దాన్ని డిలీట్ చేసినా.. ఎస్సీ, ఎస్టీ కేసు తప్పేలా లేదు.

రాజకీయాలు మీరే చేయాలా..? చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, బామ్మర్ది బాలకృష్ణ, బాలకృష్ణ మరో అల్లుడు భరత్.. ఎన్నికల్లో పోటీ చేశారు. అవకాశం ఉంటే.. మరింత మందిని బాబు రంగంలోకి దింపేవారే. అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి సంబంధించి ఏకంగా ముగ్గురు పోటీ చేసి గెలిచారు. 

గల్లా ఫ్యామిలీ, కేశినేని ఫ్యామిలీ.. ఇలా ఎక్కడికక్కడ ఫ్యామిలీలను ప్రోత్సహించే రాజకీయాలు చేస్తుంటారు చంద్రబాబు. అంతే కానీ కొత్తవారికి అవకాశం ఇవ్వడం అరుదు. తిరుపతిలో కూడా టీడీపీ కొత్త అభ్యర్థికి టికెట్ ఇస్తానంటే కాదనేవారు ఎవరున్నారు. ఆర్థికంగా బలం ఉంది కాబట్టే పనబాకను బరిలో దింపారు. ఆర్థిక బలం లేకపోయినా, ప్రజలకు సేవ చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టే జగన్, గురుమూర్తి వైపు మొగ్గారు.

గురుమూర్తి గుణగణాలను విమర్శించే అవకాశం లేకపోవడంతో, వృత్తిని, ప్రవృత్తిని విమర్శిస్తూ వికృతానందాన్ని పొందుతున్నారు టీడీపీ నేతలు. దళిత సంఘాలు భగ్గుమనడంతో... ఇప్పుడు కొత్త లాజిక్ లు వెదుకుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?