cloudfront

Advertisement


Home > Politics - Political News

తాను మునిగి, కాంగ్రెస్‌నీ ముంచిన చంద్రబాబు!

తాను మునిగి, కాంగ్రెస్‌నీ ముంచిన చంద్రబాబు!

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి అనూహ్యమైన ఫలితాలొచ్చాయి. ఏకంగా ముగ్గురు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచారంటే చిన్న విషయం కాదు. ఇది నిజంగానే కాంగ్రెస్‌ పార్టీకి చాలా పెద్దగెలుపు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బోల్తా కొట్టిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారే. ఆ విషయం ఇదిగో, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలతో ప్రూవ్‌ అయ్యింది.

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు. ఈ ఇద్దరూ ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినవారే. మరో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారనుకోండి.. అది వేరే విషయం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో చాలామంది టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసిన దరిమిలా, ఒక్క ఎంపీ సీటు అయినా కాంగ్రెస్‌కి దక్కే అవకాశం లేదని అంతా అనుకున్నారు. కానీ, కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకుంది.

ఇక, జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాకే తగిలింది. కాంగ్రెస్‌కి మాత్రమేకాదు, చంద్రబాబు పుణ్యమా అని, ఆయనతో జతకట్టిన చాలా పార్టీలకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రిజల్ట్స్‌ వచ్చాయి. పశ్చిమబెంగాల్‌లోనూ మమతకి బీజేపీ రూపంలో గట్టి షాకే తగలడం గమనార్హం. ఇదంతా చంద్రబాబు ఐరన్‌ లెగ్‌ మహిమే అనుకోవాలా.? అంతే మరి.!

మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలావున్నా, చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌ని ముంచేస్తే, కాంగ్రెస్‌తో స్నేహం కారణంగా ఎంతోకొంత చంద్రబాబు ఏపీలోనూ గట్టిగానే మునగాల్సి వచ్చింది. చంద్రబాబు విశ్వసనీయతను అత్యంత దారుణంగా కోల్పోయారనడానికి కాంగ్రెస్‌తో స్నేహమూ ఓ నిదర్శనమే మరి.!

ఇప్పుడు టీడీపీ నేతలు చెప్పగలరా, కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పేయగలరని.! చక్రం తిప్పడమా.? అసలు జనంలోకి వచ్చే సాహసం కూడా ఇంకొన్నాళ్ళు చంద్రబాబు చేయకపోవచ్చు.   

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా