cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అమ్మమ్మల కాలం నాటి భోజనం బెస్ట్- రకుల్

అమ్మమ్మల కాలం నాటి భోజనం బెస్ట్- రకుల్

ఫిట్ నెస్, యోగా, ఆహారపు అలవాట్లపై విపులంగా స్పందించింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటి ఆహార పదార్థాల కంటే.. తాతల నాటి కుకింగ్ స్టయిల్, అప్పటి వంటకాలే శరీరానికి చాలా మంచిదని చెబుతోంది. తన వ్యాయామం అలవాట్లతో పాటు ఫిట్ నెస్ కోసం రకుల్ చెబుతున్న కొన్ని టిప్స్ ఏంటో చూద్దాం. 

- మన దేశంలో హెల్త్-ఫిట్ నెస్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. మన శరీరాన్ని మనం కాపాడుకోవాల్సిందే. వేరే వ్యక్తులు మన శరీరాన్ని కాపాడరు. దేహమే దేవాలయం. ఇంట్లో చెత్త లేకుండా చూసుకుంటాం. మరి బాడీలో చెత్త లేకుండా ఎందుకు చూసుకోం. ఈ విషయాల్ని గ్రహిస్తే ఎవ్వరూ ఫిట్ నెస్ ను అశ్రద్ధ చేయరు.

- ఫిట్ నెస్ ను లైఫ్ స్టయిల్ గా చూడాలి. ఎప్పుడైతే అది మన జీవితంలో భాగం అవుతుందో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇష్టమొచ్చినట్టు తినేసి ఫిట్ నెస్ లేదని బాధపడితే టెన్షన్ పెరిగిపోతుంది. నేను కూడా నచ్చినట్టు తింటాను. కానీ నా బాడీని ఎలా మెయింటైన్ చేయాలో నాకు తెలుసు. కాబట్టి నాకు టెన్షన్ లేదు.

- ఆరోగ్యం కోసం కొంతమంది అదే పనిగా సలాడ్స్ తింటారు. ఊరికే సలాడ్స్ తినడం కూడా మంచిది కాదు. కొన్ని వండుకొని తినాలి. ఇంకా చెప్పాలంటే మన అమ్మమ్మల కాలం నాటి భోజనాలకి వెళ్లిపోవాలి. అదే సరైన పద్ధతి. తాత-అమ్మమ్మల కాలం నాటి వంటకాలతో కొవ్వు చేరదు.

- ఒకర్ని చూసి వ్యాయామాలు చేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చేయొద్దు. మీ బాడీకి ఏది నప్పుతుందో గమనించండి. అదే తినండి, అలాంటి వ్యాయామాలే చేయండి. బాడీనే కాదు, మనసు కూడా లైట్ గా ఉండాలి.

- వ్యాయామం, యోగాను మిక్స్ చేయడం చాలా మంచిది. వ్యాయమం ఫిట్ నెస్ ఇస్తే, యోగా పాజిటివ్ దృక్పథాన్ని కల్పిస్తుంది. నేను నచ్చిన ఫుడ్ తింటాను, కానీ యోగా-జిమ్ చేస్తాను. మనసు చంపుకొని ఏదీ చేయకూడదు.

- ఎన్నో సబ్జెక్టులు చదువుకుంటున్నట్టుగానే ఫిట్ నెస్ అనే సబ్జెక్ట్ ను కూడా చదువుకోవాలి. కనీసం రోజుకు 5 నిమిషాలు ఫిట్ నెస్, యోగా ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలి. ఇలా వ్యాయామం, శరీరతత్వంపై పూర్తి అవగాహన కలిగి ఉంటే ఆటోమేటిగ్గా ఫిట్ నెస్ వస్తుంది.

Click Here For Photo Gallery

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×