cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

రుజువులు చూపాలంటున్న‌ నిమ్మ‌గ‌డ్డ‌

రుజువులు చూపాలంటున్న‌ నిమ్మ‌గ‌డ్డ‌

మున్సిప‌ల్‌ ఎన్నిక‌ల‌ను ఆగిన చోటు నుంచే ప్రారంభిస్తామ‌ని చెబుతూనే, మ‌రోవైపు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కొత్త మెలిక పెట్ట‌డం ప్ర‌తిప‌క్షాల‌కు కాస్త ఊర‌ట ఇచ్చింది. 

ఇదే సంద‌ర్భంలో ఎస్ఈసీ ఆలోచ‌న కొంత మంది అవ‌కాశ‌వాదుల‌కు అస్త్రంగా ఉప‌యోగ ప‌డుతోంద‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో ఏక‌గ్రీవాలైన సీట్ల‌లో పెద్ద ఎత్తున ప్ర‌లోభాల‌కు తెర‌దీస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రో వైపు గ‌తంలో భారీగా ఏక‌గ్రీవాలు చేసుకున్న అధికార పార్టీ నుంచి ఎస్ఈసీపై విమ‌ర్శ‌లు పెరిగాయి. 

ఒక‌వైపు ఆగిన ద‌గ్గ‌రి  నుంచే ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లు పెడ‌తామంటూనే, మ‌రోవైపు ఒత్తిడితో నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకున్న వారెవ‌రైనా ఉంటే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని ఎస్ఈసీ కోర‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ విష‌య‌మై ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ మ‌రోసారి స్ప‌ష్ట‌త ఇచ్చారు.

ఒత్తిడితో నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు ఊరికే నోటి మాట‌గా చెబితే కుద‌ర‌ద‌న్నారు.  పురపాలికల్లో నామినేషన్లు వేయలేకపోయిన వారు త‌ప్ప‌కుండా రుజువు చూపాలని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అందరి హక్కులను కాపాడే బాధ్యత ఎస్ఈసీపై ఉందని ఆయ‌న చెప్పుకొచ్చారు.

పంచాయ‌తీ ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం అంకితభావంతో పని చేసిందని కితాబిచ్చారు. అధికారులంతా ఎంతో విజ్ఞత, సంయమనంతో వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 

ప్రతి విడతలో 80 శాతానికి పైగా స్వచ్ఛందంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తోందన్నారు.  మార్చి 2 నుంచి ప్రారంభ‌మ‌య్యే పురపాలక ఎన్నికల ప్రక్రియలో కూడా పట్టణ ఓటర్లు  పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఆ పేరు కూడా పలకను

విశాఖలో వైసీపీ ఓడిపోతే

 


×