cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

కోర్టుకెక్కిన ఈట‌ల భూవివాదం

కోర్టుకెక్కిన ఈట‌ల భూవివాదం

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ భూవివాదం కోర్టుకెక్కింది. మెద‌క్ జిల్లా అచ్చంపేట‌లో ఈట‌ల రాజేంద‌ర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు ఆక్ర‌మించార‌ని ప‌లువురు రైతులు ఫిర్యాదు చేయ‌డం, దానిపై విచార‌ణ‌, ఆ త‌ర్వాత కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ కార్య‌క్ర‌మాలు కేవ‌లం 48 గంటల్లోనే జ‌రిగిపోయాయి.

అయితే త‌మ‌కు తెలియ‌కుండానే త‌మ‌ భూముల్లో అధికారులు స‌ర్వేలు చేయ‌డం, ఆక్ర‌మ‌ణ‌ల‌ని తేల్చ‌డంపై మాజీ మంత్రి ఈట‌ల ఫైర్ అయ్యారు. కేసీఆర్ త‌న ద‌గ్గ‌రున్న అధికార బ‌లంతో ఇబ్బంది పెట్టొచ్చ‌ని, అయితే న్యాయ‌స్థానం అంటూ ఒక‌టుంద‌ని, తాను అక్క‌డ పోరాటం చేస్తాన‌ని ఈట‌ల హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఈట‌ల ఆ హెచ్చ‌రిక చేసిన 24 గంట‌ల్లోనే జ‌మున హ్యాచ‌రీస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. అసైన్డ్ భూముల వ్య‌వ‌హారంలో క‌లెక్ట‌ర్ నివేదిక త‌ప్పుల‌మ‌య‌మ‌ని పిటిష‌న్‌లో జ‌మున హ్యాచ‌రీస్ పేర్కొంది. 

అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని పిటిషన్‌లో పేర్కొంది. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ చేశారని పిటిషన్‌లో పేర్కొంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోర‌డం విశేషం.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×