Advertisement

Advertisement


Home > Politics - Political News

స్పీకర్ మాటలు ఆలోచింపచేసేవే!

స్పీకర్  మాటలు ఆలోచింపచేసేవే!

తమ్మినేని సీతారామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నారు. కానీ ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేలా ప్రస్తుతం జరుగుతున్న తీరు తాను ఎన్నడూ చూడలేదని తమ్మినేని అంటున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం మీద విపక్షాలు కోర్టుకెక్కి అడ్డుకోవడమేంటని తమ్మినేని ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే ఏ ప్రభుత్వం అయినా పనిచేయగలదా అని ఆయన అడుగుతున్న సూటి ప్రశ్న అందరినీ ఆలోచింపచేసేదే.

ప్రస్తుతం ఏపీ సర్కార్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని కోర్టుల ద్వారా అడ్డుకునే ధోరణి వల్ల ప్రజాస్వామ్య స్పూర్తి దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద రాజ్యాంగ నిపుణులకు, మేధావులకు కూడా చర్చించాలని తమ్మినేని కోరుతున్నారు.

అయిదేళ్ళకు గానూ ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వం తప్పులు చేస్తే అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని, వారే ఓడిస్తారని కూడా తమ్మినేని అంటున్నారు. అందువల్ల ప్రజలకు హామీలు ఇచ్చిన వచ్చిన ప్రభుత్వం వాటిని నెరవెర్చే  క్రమంలో బ్రేకులు వేయాలని ఎవరు చూసినా అది  ముమ్మాటికీ తప్పేనని ఆయన‌ అంటున్నారు.  

ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్థకు స్వతంత్రత ఉందని, వాటిని పనిచేసుకోనీయాలని కూడా ఆయన కోరుతున్నారు. మరో వ్యవస్థ జొరబడే పరిస్థితి ఏ మాత్రం హితం కాదని కూడా తమ్మినేని అంటున్నారు. ఇపుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే అసలు  ప్రజా ప్రభుత్వాలు ఉండాలా వద్ద అన్న డౌట్ కూడా వస్తోందని కూడా తమ్మినేని అంటున్నారు. 

ఏ అధికారాలు లేనపుడు ప్రభుత్వాలు ఎందుకు అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తమ్మినేని మాటలలో ఆవేదన మాత్రమే కాదు ఆలోచన కూడా ఉందని మేధావులు అంటున్నారు.

చీఫ్ జస్టిస్ అయితే కొత్త న్యాయం ఉందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?