cloudfront

Advertisement


Home > Politics - Political News

మూడోవిడత పోలింగ్ రేపే.. బీజేపీకే కీలకం!

మూడోవిడత పోలింగ్ రేపే.. బీజేపీకే కీలకం!

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల మూడోవిడత పోలింగ్ రేపు జరగనుంది. నిన్నటితోనే ప్రచార పర్వం ముగిసింది. ఈరోజు విరామ దినం. ప్రలోభాలకు ఈరోజు పని. రేపు పోలింగ్ జరగబోతూ ఉంది. మొత్తం 115 ఎంపీ సీట్లకు రేపు పోలింగ్ జరగనుంది. రేపు పోలింగ్ తో దేశంలో దాదాపు మెజారిటీ ఎంపీ సీట్లకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. తొలి విడతలతో తొంభైకి పైగా ఎంపీ సీట్లకు, రెండో విడతలో తొంభై ఐదు ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

రేపు ఏకంగా నూటా పదిహేను ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. వీటిల్లో గుజరాత్ లో 26 ఎంపీ సీట్లకు రేపు పోలింగ్ జరుగుతుంది. వాటితో పాటు కేరళ 20, గోవా రెండు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండు, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, ఒడిశాలో 10, యూపీలో 10, పశ్చిమబెంగాల్ లో ఐదు, జమ్మూలో ఒక ఎంపీ సీటు తదితర స్థానాల్లో.. రేపు పోలింగ్ జరగనుంది.

వీటిల్లో కర్ణాటక, గుజరాత్, యూపీలోని స్థానాలు భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకం, చత్తీస్ గడ్ లోని ఏడు స్థానాలు కూడా బీజేపీకి అత్యంత కీలకమే. మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రధాన పోటీదారుగా లక్ ను పరీక్షించుకోబోతోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ సీట్లలో ఆ పార్టీ ప్రధానంగా పోటీ ఇస్తోంది.

తెలుగుదేశంలోనూ విజయం మీద ఫుల్ కాన్ఫిడెన్స్!

నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు జెర్సీ సినిమా ఉందా?