Advertisement

Advertisement


Home > Politics - Political News

తిరుమ‌లలో ఇదీ ప‌రిస్థితి...

తిరుమ‌లలో ఇదీ ప‌రిస్థితి...

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుమ‌ల‌లో అప్ర‌క‌టిత లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనూహ్యంగా భ‌క్తుల రాక త‌గ్గిపోయింది. 

తిరుమ‌ల కొండ భ‌క్తుల‌తో కిక్కిరిస్తే ఎంత మాత్రం వార్త కాదు. ఏదైనా కార‌ణంతో కొండ నిండుకుంటే మాత్రం అదో పెద్ద సంచ‌ల‌న‌మే. ప్ర‌స్తుతం తిరుమ‌ల కొండంతా ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తోంది.

కోవిడ్ సెకెండ్ వేవ్ ఉధృతి నేప‌థ్యంలో ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డ‌మే సుర‌క్షిత‌మ‌ని ప్ర‌భుత్వం, వైద్య నిపుణులు హెచ్చ రిక‌లు స‌త్ఫ‌లితాల‌నే ఇస్తున్నాయి. ఇందుకు తిరుమ‌ల భ‌క్తుల లేక బోసిపోవ‌డ‌మే నిద‌ర్శ‌నం. మంగ‌ళ‌వారం శ్రీ‌వారిని ద‌ర్శించు కున్న భ‌క్తులు కేవ‌లం 4,723 మంది మాత్ర‌మే.

ఇదే సాధార‌ణ రోజుల్లో అయితే ఇంత‌కు 15-20 రెట్లు అధికంగా ఉండేది. నిన్న శ్రీ‌వారికి 2,669 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. భ‌క్తుల త‌గ్గుద‌ల శ్రీ‌వారి ఆదాయంపై కూడా ప‌డింది. 

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.39 లక్ష‌ల‌కు ప‌డి పోయింది. ఇది అత్యంత అత్య‌ల్పం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎప్పుడూ భ‌క్తుల ర‌ద్దీతో కిట‌కిట‌లాడే తిరుమ‌ల‌ను... గ‌త ఏడాది మాదిరిగాను మ‌రోసారి నిర్మానుష్యంగా చూడ‌డం ఆవేద‌న మిగుల్చుతోంద‌ని టీటీడీ ఉద్యోగులు వాపోతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?