Advertisement

Advertisement


Home > Politics - Political News

వైసీపీని వీడటంలేదు.. బీజేపీలోకి చేరడం లేదు!

వైసీపీని వీడటంలేదు.. బీజేపీలోకి చేరడం లేదు!

తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు తోట వాణి. పెద్దాపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన తోట వాణి విషయంలో బీజేపీలోకి చేరిక అనే రూమర్లు సోషల్ మీడియాలో సాగుతూ ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు. ఎన్నికలకు ముందే తోట కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరి పెద్దాపురం అసెంబ్లీ టికెట్ ను పొందారు వాళ్లు. అయితే చిన్నరాజప్ప అక్కడ నుంచి విజయం సాధించారు. తోట వాణి ఓటమి పాలయ్యారు.

అయితే చిన్న రాజప్ప ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలను పేర్కొన్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు వాణి. దానిపై విచారణ సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమెపై పార్టీ మార్పు ఊహాగానాలు రేగాయి. అయితే వాటిని ఆమె ఖండిస్తున్నారు. తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని ప్రకటన చేశారు.

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?