Advertisement

Advertisement


Home > Politics - Political News

రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణే అభివృద్ధికి తొలి మెట్టు

రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణే అభివృద్ధికి తొలి మెట్టు

రాజధాని మార్చకూడదు  కానీ మూడు  ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి అంటున్నారు. అసలు అభివృద్ధి అంటే ఎలా  జరుగుతుందో వీళ్లకు తెలుసా? 

రాజధాని వికేంద్రీకరణ అభివృద్ధి లో మొదటి మెట్టు కాదా? ఇలాంటి రాజధాని హోదా లేకుండా దేశంలో ఎక్కడ ఏ నగరం బాగా అభివృద్ధి చెందిందో 5, 6 నగరాలు చెప్పమనండి. కేవలం రాజధాని పేరు వున్నా ప్రాంతాలే గాని ఇతర ప్రాంతాలు ఏవి పెద్ద నగరాలుగా అభివృద్ధి చెందలేదు.

మనం చూసినట్లయితే దేశంలో పెద్ద నగరాలు బొంబాయి, చెన్నై, కోల్ క‌తా, బెంగళూరు, హైదరాబాద్ ఇలా అన్ని నగరాలు రాజధాని హోదా కలిగినవే తప్ప ఏవిధమైన రాజధాని అర్హత లేకుండా అభివృద్ధి చెందిన పెద్ద నగరాలు లేవు, కనీసం ఈ విధంగా ఆలోచించిన నేడు జగన్ చేసిని పనిని స్వాగతించొచ్చు. అందుకే జగన్ ఈ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు వచ్చారు. 

అభివృద్ధి అంతా ఒకే దగ్గర ఉండకూడదు హైదరాబాద్ లాగా మళ్లీ భ‌విష్య‌త్తులో వేర్పాటు వాదాలు రాకూడదు అని మూడు ప్రాంతాలకు రాజధాని హోదా కల్పిస్తూ  నిర్ణయం తీసుకున్నారు. 

అంతే కాకుండా విశాఖపట్నం అన్ని విధాలా రాజధాని కి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న ఏకైక నగరం. ఈ విషయం శివరామకృష్ణ కమిటీ కూడా సూచించింది.  కానీ చంద్రబాబు స్వార్ధంతో అమరావతిని  ప్రకటించారు. అందుకే ఇది ప్రశ్నర్ధకంగా మిగిలి పోతుంది.

కానీ విశాఖపట్నం కు రాజధాని హోదా కల్పిస్తే  ప‌దేళ్ల‌ లోనే తక్కువ పెట్టుబడితో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుంది. ఇది భోగోళికంగా అనేక ప్రత్యేక అర్హ‌త‌లు ఉన్నా నగరం.  వివిధ పారిశ్రామిక అధిపతులను ఆకర్షించే నగరం. ఎందుకంటే  అన్ని రవాణా సదుపాయాలు ఉన్న  నగరం, తక్కువ సమయంలో గొప్పగా అభివృద్ధి చేయ గల నగరం. అందుకే జగన్ ఈ ప్రాంతాన్ని ఎన్నిక చేశారు. 

కానీ చంద్రబాబులాగా స్వార్ధంగా ఆలోచినంట్లు తన కూడా తన కడప నో  లేదా పులివెందులనో ప్రకటించాలి కానీ ఆలా చేయలేదు. జగన్ ఆలోచనంత ఒకటే తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో రాష్ట్రము అభివృద్ధి చెందాలి అని ముఖ్య ఉద్దేశం.

కానీ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం వలన అమరావతి కాదు కదా కనీసం ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం లేదు.

Budireddi Ramarao

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?