cloudfront

Advertisement


Home > Politics - Political News

టిక్కెట్టు పాయె: రాములమ్మది భలే కవరింగ్‌.!

టిక్కెట్టు పాయె: రాములమ్మది భలే కవరింగ్‌.!

అసెంబ్లీలో మైక్‌ పట్టుకుని 'అధ్యక్షా..' అని ఓ సారైనా పిలవాలని చాలామంది రాజకీయ నాయకులకు వుంటుంది. అదేంటో, పార్లమెంటులో అదే మాట అనేందుకు అవకాశం వున్నా, అసెంబ్లీ మీద ఎక్కువ మమకారం చూపిస్తుంటారు రాజకీయ నాయకులు. ఈ విషయంలో 'రాములమ్మ' విజయశాంతికి తక్కువ ఆశలేమీ లేవు. ఆమె కూడా, అసెంబ్లీలో 'అధ్యక్షా..' అనాలనుకున్నారు. టైమ్‌ కలిసిరాలేదంతే ఇప్పటిదాకా.!

ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే టిక్కెట్‌ దక్కించుకుందామని విజయశాంతి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ, ఆమెకు అధిష్టానం టిక్కెట్‌ ఇవ్వలేదాయె. 'స్టార్‌ క్యాంపెయినర్‌' అనే బాధ్యతను అప్పగించి ఊరుకుంది కాంగ్రెస్‌ అధిష్టానం. 'నేను స్టార్‌ క్యాంపెయినర్‌ని.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే నా నియోజకవర్గానికే పరిమితమవ్వాలి.. అందుకే నేను టిక్కెట్‌ అడగలేదు. టిక్కెట్‌ రాకపోవడం వెనుక పార్టీ తప్పిదమేమీ లేదు' అంటూ విజయశాంతి తాజాగా సెలవిచ్చారు.

విజయశాంతి ప్రముఖ సినీ నటి. గతంలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా గెలిచినా.. ఆ తర్వాత రాజకీయాలకు అంత దగ్గరగా లేరామె. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ 'సై' అన్నాక, అనూహ్యంగా రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యారు విజయశాంతి. ఢిల్లీ పెద్దలతో రెగ్యులర్‌గా టచ్‌లో వున్నా, డైరెక్ట్‌గా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో సంబంధాలు కొనసాగిస్తున్నా.. పాపం, విజయశాంతికి అసెంబ్లీ టిక్కెట్‌ దొరక్కపోవడం ఆశ్చర్యకరమే.

టిక్కెట్‌ దొరికే అవకాశం లేదు గనుక, 'స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా' పేరుతో హల్‌చల్‌ కొనసాగించి, 'అలా సర్దుకుపోవాలి' అన్నది బహుశా విజయశాంతి ఆలోచనేమో. పాపం విజయశాంతికి ఈసారీ అసెంబ్లీలో అధ్యక్షా అనే అవకాశం రాలేదన్నమాట. ఇంతకీ, విజయశాంతికి టిక్కెట్‌ దండగని అధిష్టానానికి నివేదిక పంపినదెవరబ్బా.? ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి.. ఈ ఇద్దరే టిక్కెట్ల ఎంపికలో కీలక పాత్ర పోషించారు మరి.!

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్