cloudfront

Advertisement


Home > Politics - Political News

టాలీవుడ్‌ అటు వైపు చూస్తుందా.?

టాలీవుడ్‌ అటు వైపు చూస్తుందా.?

తెలంగాణ ఎన్నికలకు తెలుగు సినీ పరిశ్రమ దూరంగా వుంది. సినీ పరిశ్రమలో రాజకీయ పార్టీలతో సంబంధం వున్నవాళ్ళు చాలామందే వున్నారుగానీ, చాలామంది సేఫ్‌ గేమ్‌ ఆడారు. కొందరు తెలివిగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా మాట్లాడారు. అంతే తప్ప, ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీతో సంబంధాలున్నాయి కదా.. అని ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడింది లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ అధికారంలోకి వస్తుందని బహుశా తెలుగు సినీ పరిశ్రమకి ముందే సమాచారం అందిందేమో.. అన్నట్టుంది పరిస్థితి.

ఇంతకీ, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి తెలుగు సినీ పరిశ్రమ ఎలా వ్యవహరిస్తుందట.? సినీ పరిశ్రమలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులే ఎక్కువ. పవన్‌కళ్యాణ్‌, జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నా.. ఆయనకి మద్దతిచ్చేవారు చాలా చాలా తక్కువ. ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఏం జరిగిందో చూశాం. అయితే, అప్పటికీ ఇప్పటికీ ఇక్వేషన్స్‌ కొంత మారాయన్న వాదనా లేకపోలేదు.

నిజానికి, తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలున్నా, గడచిన నాలుగేళ్ళలో ఆ 'గుడ్‌ విల్‌'ని తెలుగుదేశం పార్టీ కోల్పోయింది.. సినీ పరిశ్రమ దృష్టిలో. నంది అవార్డుల విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. తెలుగు సినీ పరిశ్రమతో ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్‌ ఓ ఆట ఆడేసింది. ప్రత్యేక హోదా విషయమై ఒకరిద్దరు నినదిస్తే, వారిపై అవాకులు చెవాకులూ పేలారు తెలుగుదేశం పార్టీ నేతలు.

మళ్ళీ ఆ నేతలే, ప్రత్యేక హోదా గురించి తెలుగు సినీ పరిశ్రమ ఎందుకు మాట్లాడటంలేదంటూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. అలా తెలుగుదేశం పార్టీ, టాలీవుడ్‌కి దూరమైందనే చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపుని చాలామంది సినీ ప్రముఖులు ఆకాంక్షించారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని తెలుగు సినీ పరిశ్రమలో ఎవరూ ఆకాంక్షించడంలేదన్న వాదన గట్టిగా విన్పిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తీసుకెళ్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెబితే, అమరావతి తీసుకొస్తామని అంబికా కృష్ణ అంటున్నారు.

ఆ దిశగా చంద్రబాబు సర్కార్‌, తెలుగు సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా వ్యవహరించింది మాత్రంలేదు. సినిమా అంటేనే వ్యాపారం. ఆ వ్యాపారం తెలంగాణలో భేషుగ్గా సాగుతోంది. సినీ పరిశ్రమ పట్ల తెలంగాణ సర్కార్‌ సానుకూలంగా వ్యవహరిస్తున్నప్పుడు, అన్ని సౌకర్యాలూ వున్న హైద్రాబాద్‌ని వదిలి విశాఖకో అమరావతికో ఎలా వెళుతుంది.? పైగా, టీడీపీ నేతలతో అవాకులు చెవాకులు పేలించిన చంబ్రాబు పట్ల టాలీవుడ్‌ ఎందుకు సానుకూలంగా వ్యవహరిస్తుంది.?

జగన్, పవన్ కలిసి పనిచేసినా మాకు ఓకే 

త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే