Advertisement

Advertisement


Home > Politics - Political News

తొమ్మిది జిల్లాలు దాదాపు కరోనా ఫ్రీ?

తొమ్మిది జిల్లాలు దాదాపు కరోనా ఫ్రీ?

కరోనా మహమ్మారి విజృంభించడం ప్రారంభించిన తరువాత ఇలాంటి అంకెలు చూడలేదు. ముఖ్యంగా ఆంధ్రలో వేల సంఖ్యలో కరోనా టెస్ట్ లు చేయడం మొదలుపెట్టిన తరువాత వేలకు వేలల్లో పాజిటివ్ కేసులు రావడం, ఎన్ని టెస్ట్ లు చేస్తే ఎన్ని కేసులు వచ్చాయన్న సంగతి వదిలేసి, ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడం సరిపోయింది ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకు.

కానీ ప్రజలు మాత్రం ఆంధ్ర ప్రభుత్వం కరోనా విషయంలో తీసుకున్న జాగ్రత్తలను, శ్రద్దను మాత్రం గమనిస్తూనే వచ్చారు. ఆఖరికి ప్రభుత్వం చర్యలు ఇఫ్పటికి ఫలితాన్నిచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రజలు మాస్కలు కూడా దాదాపు మరిచిపోయి, బజార్లలో కూడా కలియ తిరిగేస్తున్నా, కేసులు మాత్రం భయంకరంగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు (సోమవారం) దాదాపు తొమ్మిది జిల్లాల్లో డబుల్ డిజిట్ కు వచ్చేసింది. ఈస్ట్, వెస్ట్, గుంటూరు, చిత్తూరు మినహా అన్ని జిలాల్లోను వంద లోపు ఫిగర్లే.  

మొత్తం రాష్ఠ్రంలోని 13 జిల్లాల్లో కలిపి రెండు వేల లోపు కేసులే. అలా అని పరీక్షలు ఏమీ తగ్గలేదు. దాదాపు యాభై, వేలకు పైగా పరిక్షలు చేసారు. అయితే ఇంకా రాష్ట్రం మొత్తం మీద 28 వేల మంది కరోనా పేషెంట్లు వున్నారు.

వీరంతా కోలుకోవాల్సి వుంది. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగి, కరోనా సెకెండ్ వేవ్ కనుక రాకుండా వుంటే త్వరలోనే ఈ మహమ్మారి మన ముందు నుంచి కనుమరుగు కావచ్చు.

గ్రేట్ ఆంధ్రా వచ్చిందే అందుకని తెలుసు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?