cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

టాప్ లేపుతున్న విశాఖ

టాప్ లేపుతున్న విశాఖ

విశాఖ భయపెడుతోంది. ఇప్పటిదాకా నెమ్మదిగా ఉంటూ వస్తున్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలలో టాప్ ర్యాంకర్ గా విశాఖ ఉండడం ఆందోళన కలిగించే విషయమే.

గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా కేసులు ఎక్కువగా 2,238 రావడం గమనార్హం. అంతే కాదు, మరణాల విషయంలో కూడా విశాఖ నంబర్ వన్ గా ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 11 మంది విశాఖలో కరోనా బారిన పడి కన్ను మూశారు.

తూర్పు గోదావరి జిల్లాలో కేసులు ఎక్కువగా వచ్చినా మరణాల విషయంలో మాత్రం నంబర్ తక్కువగా ఉంది. విశాఖలో కరోనా చావులు అంతకంతకు పెరిగిపోవడం పట్ల వైద్య రంగ నిపుణులు సైతం కలవరపడుతున్నారు.

విశాఖకు అన్ని వైపుల నుంచి ప్రతీ రోజూ వచ్చే పోయే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో పాటు పక్కనే ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కేసుల ప్రభావం కూడా పడుతోంది అని విశ్లేషిస్తున్నారు. 

ఏది ఏమైనా కరోనాను బేఫికర్ చేస్తూ తిరిగేవారంతా ఈ డేంజర్ నంబర్లను చూసైనా దారికి రాకపోతే విశాఖ షాక్ ఇచ్చేలా ఉందనే అంటున్నారు.

గడ్డం పెంచగానే మాస్ లీడర్ అయిపోవు లోకేష్

సాయం చేయడం నా తల్లి నుంచే నేర్చుకున్నా

 


×