cloudfront

Advertisement


Home > Politics - Political News

టీఆర్‌ఎస్‌ పేరు మార్చేసిన కవిత

టీఆర్‌ఎస్‌ పేరు మార్చేసిన కవిత

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ని ధీటుగా ఎదుర్కొనగల పార్టీ ఇప్పట్లో ఏదీ కన్పించడంలేదు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్‌, తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థుల్ని దాదాపుగా 'నేలమట్టం' చేసేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అంతర్ధానమైపోయిన సంగతి తెల్సిందే. బీజేపీ సంగతి సరే సరి. గెలుపు నల్లేరు మీద నడకే అయినా, తెలంగాణ రాష్ట్ర సమితికి నిజామాబాద్‌లో కొంత తలనొప్పి తెచ్చిపెట్టేలా వుంది. 

సిట్టింగ్‌ ఎంపీ కవిత మరోమారు బంపర్‌ మెజార్టీతో నిజామాబాద్‌ నుంచి గెలవాలనే కసితో వున్నారుగానీ, ఆమెకు గట్టిగా ఝలక్‌ ఇచ్చేందుకు స్వయంగా రైతులు రంగంలోకి దిగుతుండడం గమనార్హం. పసుపు పంటకు గిట్టుబాటు సహా అనేక సమస్యలపై రైతులు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.. ఏం చేసినా, ఇటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కావొచ్చు, అటు బీజేపీ ప్రభుత్వం కావొచ్చు రైతుల పట్ల సానుకూలంగా స్పందించిన దాఖలాల్లేవు. 

దాంతో రైతులు, పెద్దయెత్తున నామినేషన్లు వేయడం ద్వారా తమ నిరసనలు తెలపాలనే ఆలోచనతో వున్నారు. ఇందు కోసం అవసరమైన ఏర్పాట్లనూ నిజామాబాద్‌ రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. ఓడిపోతాననే భయం లేదుగానీ, కవితకి ఇది చాలా పెద్ద అవమానమే. అందుకే ఆమె ఒకింత కంగారు పడ్తున్నారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కవిత, రైతుల తిరుగుబాటుపై స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని తెలంగాణ రైతు సమితిగా మార్చేశారు. 

నిజామాబాద్‌లో కాదు, అమేధీలోనూ, వారణాసిలోనూ వెయ్యేసి నామినేషన్లు వేద్దామంటూ కవిత పిలుపునిచ్చారుగానీ, సొంత నియోజకవర్గంలో రైతుల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను మాత్రం చల్లార్చలేరన్నది నిర్వివాదాంశం. మరోపక్క, డ్యామేజీ కంట్రోల్‌ చర్యలకు దిగిన టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, గ్రామాల్లో రైతులతో మంతనాలు జరుపుతున్నారు.. రైతుల సమస్యలపై పార్లమెంటులో పోరాడతామనీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామనీ రైతులకు భరోసా ఇస్తున్నా