cloudfront

Advertisement


Home > Politics - Political News

కష్టమా?.. సులభమా?

కష్టమా?.. సులభమా?

తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో వందస్థానాలు తమకే దక్కుతాయని టీఆర్‌ఎస్‌ ఎప్పటినుంచో చెబుతోంది. తనకు బలమైన ప్రత్యర్థులు లేరు కాబట్టి వంద సీట్లు గ్యారంటీగా గెలుస్తామంటోంది. కాని వందసీట్లు గెలవడం సాధ్యంకాదని, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగినప్పుడే నిర్వహించిన ఎన్నికల్లో (2014) టీఆర్‌ఎస్‌ కేవలం 63 స్థానాలు సాధించిందని, గత నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత బాగా పెరిగింది కాబట్టి వందకు వందస్థానాలు రావడం జరగదని రాజకీయ పండితులు చెబుతున్నారని ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది.

టీఆర్‌ఎస్‌ వందసీట్లు సాధించాలంటే గత ఎన్నికల్లో  గెలుచుకున్న అన్ని స్థానాల్లోనూ విజయం సాధించాలి. 15 స్థానాలున్న హైదరాబాదులో, 14 స్థానాలున్న రంగారెడ్డిలో అత్యధిక స్థానాలు గెలుచుకోవల్సి వుంటుంది. గత ఎన్నికల్లో హైదరాబాదులో ఒక్కస్థానాన్ని, రంగారెడ్డి జిల్లాలో నాలుగు స్థానాలను మాత్రమే టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. గత ఎన్నికల ఫలితాలు ఓసారి పరిశీలిద్దాం.... నిజామాబాదులో 9కి 9 సీట్లు, కరీంనగర్‌లో 13కు 12 సీట్లు గెలుచుకుంది. మెదక్‌లో 10కి 8, వరంగల్‌లో 12కు 8 స్థానాలు గెలుచుకుంది.

ఆదిలాబాదులో 10కి 7, నల్గొండలో 12కు 6 సీట్లు గెలుచుకుంది. మహబూబ్‌నగర్‌లో 14కు 7, ఖమ్మంలో 10కి ఒకటి గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో వందసీట్లు సాధించాలంటే గత ఎన్నికల్లో తాను గెలిచిన స్థానాలతోపాటు ఓడిపోయిన స్థానాలనూ గెలుచుకోవల్సి వుంటుంది. గత ఎన్నికల నాటికి ఉద్యమం ఉధృతంగా జరగడమే కాకుండా, ఎన్నికల్లో అన్ని వర్గాలవారూ టీఆర్‌ఎస్‌కు ప్రత్యేకించి కేసీఆర్‌కు మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ కేవలం 63 స్థానాలే దక్కాయి. నాలుగున్నరేళ్ల పరిపాలన తరువాత అనేక వర్గాలు టీఆర్‌ఎస్‌కు దూరమయ్యాయి.

చాలా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటున్నారు. కాంగ్రెసు నేతృత్వంలోని మహాకూటమి టీఆర్‌ఎస్‌ విజయావకాశాలను దెబ్బతీసే పరిస్థితి కనబడుతోంది. పరిస్థితి ఈవిధంగా ఉండటంతో టీఆర్‌ఎస్‌ వందస్థానాలు సాధించడం సులభం కాకపోవచ్చు. గత ఎన్నికల్లో 63 స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ ఫిరాయింపుల ద్వారా ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకుంది. అయితే టీఆర్‌ఎస్‌ వాదన మరోలా ఉంది.

గత ఎన్నికలనాటికి టీఆర్‌ఎస్‌కు ఓటు బ్యాంకు లేదు. జిల్లాల్లో బలమైన నాయకులు, కేడర్‌ లేదు. కాని గత నాలుగున్నరేళ్లలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో బలమైన  కేడర్‌ ఏర్పడింది. నాయకులు తయారయ్యారు. ఓటు బ్యాంకు పెరిగింది. కాబట్టి వందసీట్లు సాధించడం కష్టం కాబోదని టీఆర్‌ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల మీదనే రెండు లక్షలకోట్లు ఖర్చు చేసిందంటున్నారు.

ఈ పథకాల ద్వారా లబ్ధి పొందినవారంతా టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తారని చెబుతున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 29 స్థానాల్లో పాత బస్తీలోని 7 సీట్లు టీఆర్‌ఎస్‌ మిత్ర పార్టీ ఎంఐఎం గెలుచుకుంటుంది. మిగిలిన 22 స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులతో పోటీపడాల్సి వుంటుంది. ఈ నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్లు జయాప జయాలను నిర్ణయిస్తారు.

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్