Advertisement

Advertisement


Home > Politics - Political News

ట్రంప్ వ‌ర్సెస్ ట్విట‌ర్‌

ట్రంప్ వ‌ర్సెస్ ట్విట‌ర్‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట‌ర్ మ‌ధ్య ట్వీట్ల పోరు జ‌రుగుతోంది. ట్రంప్ వైఖ‌రిని ట్విట‌ర్ ఎండ‌గ‌ట్టింది. ఇదే స‌మ‌యంలో ట్రంప్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ట్విట‌ర్ అవినీతి, మోసాల‌కు ఆస్కార‌మిస్తోంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు వాళ్ల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి కార‌ణాలేంటో తెలుసుకుందాం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెయిల్ ఇన్ ఓటింగ్‌పై  చేసిన రెండు ట్వీట్లు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ట్విటర్‌ నిజ నిర్థారణ చేసింది. అంతేకాదు, ఆ రెండు ట్వీట్లను తప్పు దోవ పట్టించే వాటిగా లేబుల్‌ చేస్తూ ట్విట‌ర్ హెచ్చరించింది.

మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌పై  ప్రెసిడెంట్‌ ట్రంప్ మంగ‌ళ‌వారం స్పందిస్తూ.. ‘ మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ ద్వారా మోసం చేయటానికి లేదని ఖచ్చితంగా చెప్పలేము. మెయిల్‌ బాక్సులను దొంగిలించవచ్చు. బ్యాలెట్లను ఫోర్జరీ చేయొచ్చు. చట్టవిరుద్ధంగా వాటిని ప్రింట్‌ అవుట్ తీయొచ్చు. దొంగ సంతకాలు కూడా చేయొచ్చు. కాలిఫోర్నియా ప్రభుత్వం మిలియన్ల మంది ప్రజలకు బ్యాలెట్లను పంపిస్తోందా?’ అని ట్రంప్‌ ప్రశ్నించారు.

ఈ ట్వీట్‌తో పాటు మరో ట్వీట్‌పై  ట్విటర్‌ నిజనిర్థారణ చేసింది. అనంత‌రం ట్విట‌ర్ స్పందిస్తూ.. ‘ మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ ద్వారా రిగ్గింగ్‌కు ఆస్కారం ఉందంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తప్పుడు ప్రకటనలు చేశారు. ఏది ఎమైనప్పటికి మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ ద్వారా ఓటర్లు మోసాలకు పాల్పడే అవకాశం లేదని మా నిజ నిర్థారణ నిపుణులు తేల్చారు’ అని పేర్కొంది.

దీంతో ట్రంప్ త‌న విమ‌ర్శ‌ల‌పై ఏ మాత్రం త‌గ్గ‌లేదు. మ‌రోసారి ఆయ‌న రెచ్చిపోయారు. ట్విట‌ర్ స్పంద‌న‌పై ట్రంప్ తిరిగి స్పందిస్తూ.. ‘ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విటర్‌ జోక్యం చేసుకుంటోంది. మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌పై నేను చేసిన వ్యాఖ్యలు అవినీతి, మోసాలకు ఆస్కారమిస్తాయని అంటోంది. అది ముమ్మాటికి తప్పు’  అని ట్రంప్ అన్నారు. ఎదుటి వాళ్ల‌ను టార్గెట్ చేయ‌డంలో ట్రంప్ త‌ర్వాతే ఎవ‌రైనా! అది ఈ ట్వీట్ల గొడ‌వే నిరూపిస్తోంది. 

మన పాలన-మీ సూచన, 2వ రోజు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?