cloudfront

Advertisement


Home > Politics - Political News

తమిళ, తెలుగు భాషల్లో మలయాళీ హీరోకి హిట్స్!

తమిళ, తెలుగు భాషల్లో మలయాళీ హీరోకి హిట్స్!

ఫిబ్రవరి ఒకటో తేదీన తమిళంలో ‘పెరన్బు’ విడుదల అయ్యింది. ఆ తర్వాతి వారంలో తెలుగులో ‘యాత్ర’ విడుదల అయ్యింది. పరిమిత బడ్జెట్ లలో రూపొందిన ఈ సినిమాలు రెండూ పాజిటివ్ టాక్ తో మమ్ముట్టీకి రెండు హిట్స్ ఇవ్వడం విశేషం.

రామ్ దర్శకత్వంలో తమిళంలో ‘పెరన్బు’ రూపొందింది. విడుదలకు ముందే ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఆ సినిమా ప్రదర్శితం అయ్యింది. కేవలం ఏడుకోట్ల రూపాయల బడ్జెట్ లో రూపొందిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. కమర్షియల్ గా కూడా ఆ డబ్బును రాబట్టుకోవడం పెద్దకష్టం ఏమీ కావడంలేదు.

ఇక పెరన్బుతో పోలిస్తే యాత్ర బడ్జెట్ ఎక్కువే. మలయాళీ హీరో అయిన మమ్ముట్టీ మీద భారీ ఇన్వెస్ట్ మెంటే యాత్ర బడ్జెట్. అయినప్పటికీ ఇది వైఎస్ కథాంశం కావడంతో కమర్షియల్ గా కూడా రూపకర్తలకు సంతృప్తి మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఒకే నెలలో తమిళంలో ఒక సినిమా, తెలుగులో మరో సినిమాతో హిట్స్ ను అందుకున్నాడు మమ్ముట్టీ.

ఇదివరకూ మమ్ముట్టీ తమిళంలోనూ పలు సినిమాల్లో నటించాడు. దళపతి, ప్రియురాలు పిలిచింది, ఆనందం (తెలుగులో సంక్రాంతి) వంటి తమిళ సినిమాలతో మమ్ముట్టీ అక్కడ విజయాలను అందుకున్నాడు. తెలుగులో కూడా రెండు మూడు సినిమాలు చేసిన మమ్ముట్టీకి యాత్రతో హిట్ లభించింది.

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు