cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఉక్కు ఉద్యమంపై 'సత్యవాక్కు'

ఉక్కు ఉద్యమంపై 'సత్యవాక్కు'

''...విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పేరిట ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల విన్యాసాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది, ఆవేశంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ఈ నేతల్లో అనేకమంది విశాఖపట్టణాన్ని ఏదో రకంగా దోచుకున్నవారే. వారిలో స్టీల్ ఫ్యాక్టరీని తమ ఉపాధిగా భావించి కోట్లాది రూపాయలు ఆర్జించిన వారే. స్టీల్ ప్లాంట్ భూములపై, ఆస్తులపై కన్నేసిన వారు కూడా వారిలో లేకపోలేదు. 

నిబంధనలకు వ్యతిరేకంగా బీచ్ ఒడ్డున భవంతులు కట్టుకున్నవారు, ఎడా పెడా భూదందాలు చేసిన వారు, బతుకు తెరువుకోసం విశాఖకు చేరి షిప్పింగ్, కాంట్రాక్టుల రంగంలో పైకి ఎదిగిన వారు, ఒక పార్టీ లేకపోతే మరొక పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నవారు ఇవాళ గత చరిత్రను తడుముతూ, పాదయాత్రలు చేస్తూ ప్రజలకోసం బూటకపు కన్నీరు కారుస్తున్నారు...''

ఈ వాక్యాలు ఓ దినపత్రిక ఎడిటోరియల్ ఫేజీలో కనిపించే అనేకానేక రాజకీయ పార్టీల నేతల్లో ఒకరైన భాజపా సత్యప్రసాద్ వి. ఆయన ఆ పార్టీ జాతీయ కార్యదర్శి. విశాఖపై వాలి, వందలు వేల కోట్లు ఆర్జించిన నాన్ లోకల్ రాజకీయ వేత్తల గురించి మన మీడియా రాయమన్నా రాయదు. 

ఎందుకంటే వాళ్లకు వున్న బంధాలు అలాంటివి. ఇలాంటి నేపథ్యంలో సత్య ప్రసాద్ తన కాలమ్ లో ఇన్ డైరక్ట్ గా  విశాఖ రాజకీయ నాయకుల బాగోతాన్ని ఎండగట్టారు.

ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు మీద బాణాలు ఎక్కుబెట్టారు. షిప్పింగ్ కాంట్రాక్టులతో ఎదిగారు, మరో పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు అంటూ ఆయన రాసుకురావడం విశేషం. అలాగే నిబంధనలకు విరుద్దంగా బీచ్ ఒడ్డున భవంతులు కట్టుకున్నారు అంటూ తేదేపా నాయకులను ఆయన పరోక్షంగా టార్గెట్ చేసారు. 

అంతే కాదు...''  స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల టెండర్ల విలువను ఇష్టారాజ్యంగా పెంచి కోట్లాది రూపాయలు దోపిడీ చేసిందెవరు?..'' అంటూ ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడి వ్యవహారాన్ని కూడా సత్య ప్రసాద్ ప్రస్తావించడం విశేషం. మొత్తం మీద విశాఖ ఉక్కు ఉద్యమం సాగిస్తున్న రాజకీయ నాయకుల బాగోతాలను బయటపెట్టాలనే భాజపా డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

దేశం మౌనం పాటిస్తోంది

ఆ పేరు కూడా పలకను

 


×