Advertisement

Advertisement


Home > Politics - Political News

టీలో నెయ్యి.. ఎప్పుడైనా ట్రై చేశారా?

టీలో నెయ్యి.. ఎప్పుడైనా ట్రై చేశారా?

చెప్పుకోడానికి కాస్త ఎబ్బెట్టుగా ఉండొచ్చు. టేస్ట్ కూడా వెరైటీగా అనిపిస్తుంది. కానీ రోజూ సేవించే టీలో నెయ్యి వేసుకుంటే దాని వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి మార్కెట్లో పెట్టిన పేరు 'ఘీ టీ'.

'ఘీ టీ' అనేది మనం ప్రత్యేకంగా తయారు చేసుకోనక్కర్లేదు. రోజూ చేసుకునే టీలోనే కాసింత ఆవు నెయ్యి కలుపుకుంటే సరిపోతుంది. అదే ఘీ టీ అన్నమాట. నిజానికి ఈ తేనీరు కనిపెట్టడం వెనక ఉద్దేశం వేరే ఉంది. 

ప్రతి రోజూ నెయ్యి తింటే మంచిదంటారు. కానీ నేరుగా నెయ్యి తినడానికి చాలామంది ఇష్టపడరు. సరిగ్గా ఇక్కడే 'ఘీ టీ' కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది.

ఈ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఎసిడిటీ, గ్యాస్ బాధలు తగ్గడంతో పాటు.. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాస్త డబ్బులు పెట్టే వాళ్లయితే, ఈ టీలో కొంచెం కుంకుమ పువ్వు కలుపుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

ఉదయం లేచిన వెంటనే వేడి వేడిగా ఈ ఘీ టీ తాగడం చాలామంచిదంటున్నారు వైద్యులు. అయితే ఇందులో పాటించాల్సిన జాగ్రత్త ఒక్కటే. టీ మరిగించేటప్పుడు నేరుగా నెయ్యి కలిపితే రుచి పూర్తిగా మారిపోతుంది. కాబట్టి కప్పులో వడపోసుకున్న తర్వాత కాస్త నెయ్యి చేరిస్తే సరిపోతుంది. నెయ్యిని ఇష్టపడేవాళ్లు.. ఈ ఘీ టీని ట్రై చేయొచ్చు.

ఇంటి వ‌ద్ద‌కే బియ్యం

ఆ ముగ్గురూ ముగ్గురే

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?