Advertisement

Advertisement


Home > Politics - Political News

విశాఖ హబ్ గా ఉత్తరాంధ్రా అభివృద్ధి

విశాఖ హబ్ గా ఉత్తరాంధ్రా అభివృద్ధి

విశాఖ సిటీని గ్రోత్ ఇంజన్ గా చేసుకుని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ గానే ఆలోచిస్తున్నారు. విశాఖను టూరిజం పరంగా, ఆర్ధికంగా కూడా అతి పెద్ద హబ్ గా అభివృద్ధి చేయలాని వైసీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.

ఏపీని నడిపించాలంటే ప్రగతి గతిన రాష్ట్రం ముందుకు సాగాలంటే మెగా సిటీగా ఉన్న విశాఖ మీద ఫోకస్ పెట్టాల్సిందే అని జగన్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేవలం విశాఖ మాత్రమే కాకుండా బాగా వెనకబడిన ఉత్తరాంధ్రా కూడా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ మేరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు ఓడరేవు నిర్మాణం కూడా కంప్లీట్ చేయాలని వైసీపీ సర్కార్ ప్రణాలికలను రూపొందించింది. ఈ రెండు భారీ ప్రాజెక్టులతో ఉత్తరాంధ్రా స్వరూపం పూర్తిగా మారిపోతుందని భావిస్తున్నారు.

ప్రత్యేకింది ఉత్తరాంధ్రా అభివృద్ధి మీద ముఖ్యమంత్రి జగన్ స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోందని ఆయన అన్నారు. మూడు జిల్లాల వెనకబాటుతనాన్ని పారదోలుతామని కూడా స్పష్టంగా పేర్కొనడం చూస్తే ఈ ప్రాంత వాసులకు శుభ పరిణామమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?