cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

వ్యాక్సినే ప‌రిష్కారం.. తేల్చి చెబుతున్న వైద్యులు

వ్యాక్సినే ప‌రిష్కారం.. తేల్చి చెబుతున్న వైద్యులు

కోవిడ్-19 సెకెండ్ వేవ్ లో విప‌రీత స్థాయిలో వ్యాపిస్తూ ఉంది. రోజుకు ల‌క్ష‌కు పైగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్ర‌మక్ర‌మంగా పెరుగుతూ ఉంది. గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. సెకెండ్ వేవ్ లో ప్ర‌భుత్వం వ‌ద్ద న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య త‌క్కువే అయి ఉంటాయి. కోవిడ్-19 సంక్ర‌మ‌ణ‌, వ్యాధి ప్ర‌భావం గురించి కొంత క్లారిటీ రావ‌డంతో చాలా మంది సొంత చికిత్స‌, ప్రైవేట్ చికిత్స‌కు వెనుకాడటం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో నంబ‌ర్లు మ‌రింత భారీగా ఉండ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం అవుతోంది.

ఇక ఈ ద‌శ‌లో కోవిడ్-19 సోకిన వారిపై కూడా తీవ్ర దుష్ఫ్ర‌భావాలు ఉన్నాయ‌ని బాధితులు చెబుతున్న దాన్ని బ‌ట్టి తెలుస్తోంది. వైర‌స్ బ‌ల‌హీన‌ప‌డ‌టం అనేది కేవ‌లం అపోహ మాత్ర‌మే అని బాధితుల క‌థ‌నాలు చెబుతున్నాయి. తీవ్ర శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ట కొంద‌రు కోవిడ్ పేషెంట్లు. 

ప్ర‌త్యేకించి అప్ప‌టికే ఏదైనా దీర్ఘ‌కాలిక జ‌బ్బు ఉన్న వారిపై ఈ వైర‌స్ ప్ర‌భావం మ‌రింత తీవ్రంగా ఉంద‌ని బాధితుల క‌థ‌నాల‌ను బట్టి తెలుస్తోంది. అలాగే ఇండియాలో ఈ ద‌శ‌లో కూడా కోవిడ్ కార‌ణ మ‌ర‌ణాలు సంభ‌విస్తూ ఉన్నాయ‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలే చెబుతున్నాయి. ఏతావాతా.. కోవిడ్-19 వైరస్ మ‌హమ్మారే, ప్ర‌మాద‌కారే అని స్ప‌ష్టం అవుతూ ఉంది.

ఇక దీని నియంత్ర‌ణ‌కు వ్య‌క్తిగ‌త జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే ప‌రిష్కారం అని వైద్యులు స్ప‌ష్టం చేస్తూ ఉన్నారు. మాస్క్ త‌ప్ప‌నిస‌రి అని, వీలైనంత‌గా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం, వ‌చ్చినా జాగ్ర‌త్త చ‌ర్య‌లు కొన‌సాగించ‌డ‌మే కోవిడ్ ను ద‌రి చేయ‌నీయ‌ద‌ని వారు చెబుతున్నారు. 

ఇక వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియే దేశాన్ని కోవిడ్ నుంచి కాపాడ‌గ‌ల‌ద‌ని నిపుణులు తేల్చి చెబుతున్నారు. వ్యాక్సిన్ ను లైట్ తీసుకోవ‌ద్ద‌ని.. ఎవ‌రో కొంద‌రికి వ్యాక్సిన్ వేసినా కోవిడ్ సోకింద‌నే వార్త‌ల‌ను చూసి వ్యాక్సిన్ ల‌ను త‌క్కువ అంచ‌నా వేయొద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

రెండు డోసుల వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కూడా కొంత‌మందికి కోవిడ్-19 సోకి ఉండ‌వ‌చ్చ‌ని, అయితే దాని ప్ర‌భావం మాత్రం వారిపై త‌క్కువే అని వైద్యులు చెబుతున్నారు. రెండు ద‌శ‌ల వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కోవిడ్-19 సోకి చ‌నిపోయిన వాళ్లు ఎవ్వరూ లేర‌ని కూడా వారు ధీమాగా చెబుతున్నారు.

వ్యాక్సిన్ వేయించుకున్న క‌నీసం ఆరేడు వారాల త‌ర్వాతే శ‌రీరంలో యాంటీబాడీలు జ‌న‌రేట్ అవుతాయ‌ని, రెండో డోసేజ్ అప్పుడు వేయించుకోవాల‌ని, ఆ త‌ర్వాత రెండు వారాల్లో పూర్తి స్థాయిలో యాంటీ బాడీలు ఉత్ప‌త్తి కాగ‌ల‌వ‌ని వైద్యులు వివ‌రిస్తున్నారు. ఆ స‌మ‌యంలో కోవిడ్-19 సోకే అవ‌కాశాలు చాలా వ‌ర‌కూ త‌గ్గుతాయ‌ని చెబుతున్నారు. కోవీ షీల్డ్ వంటి వ్యాక్సిన్ ప్ర‌భావం క‌నీసం 60 శాతం వ‌ర‌కూ ఉంది. 

ఇండియాలో విస్తృతంగా ఇస్తున్న‌ది ఈ వ్యాక్సిన్ నే. క‌నీసం 60 శాతం వైర‌స్ సోకే అవ‌కాశాలే లేక‌పోవ‌డం గొప్ప సానుకూలాంశ‌మే. ఒక‌వేళ వైర‌స్ సోకినా.. రెండో డోసేజ్ ల వ్యాక్సిన్ తీసుకున్న వారిపై దుష్ఫ్ర‌భావాలు త‌క్కువ‌ని వైద్యులు నమ్మ‌కంగా చెబుతున్నారు. అనేక అధ్య‌య‌నాలు ఇదే చెబుతున్నాయ‌ని వారంటున్నారు. 

ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ మాత్ర‌మే దేశాన్ని, ప్ర‌జ‌ల‌ను కోవిడ్ బారి నుంచి కాపాడగ‌ల‌ద‌ని వారు చెబుతున్నారు. ప్ర‌జ‌లు కూడా ఇప్పుడు వ్యాక్సినేష‌న్ ప‌ట్ల అనుమానాల‌ను ప‌క్క‌న పెట్టి, అందుకు ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా క‌నిపిస్తూ ఉంది.

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×