Advertisement

Advertisement


Home > Politics - Political News

కన్నాను కదిలించేందుకు చంద్రబాబు ప్రయత్నమా?

కన్నాను కదిలించేందుకు చంద్రబాబు ప్రయత్నమా?

బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మినారాయణను మార్పించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉన్నారని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వి.విజయసాయి రెడ్డి. కన్నాను కాదని తన వారిని ఆ స్థానంలో కూర్చబెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని, ఇందుకోసం ఇటీవలే కాషాయ తీర్థం పుచ్చుకుని ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్ లు కృషిచేస్తూ ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. ఇతర అంశాల మీదా విజయసాయి రెడ్డి స్పందించారు.

''గతంలో సోము వీర్రాజును రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడు కన్నాను కదిలించి తన విధేయుడిని అధ్యక్షుడిగా నియమించేందుకు సుజనా, సిఎం రమేశ్ ల ద్వారా లాబీయింగ్ చేస్తున్నాడు. ఢిల్లీలో పరిణామాల్ని వీళ్లిద్దరు ఎప్పటికప్పుడు తమ బాస్ కు బ్రీఫ్ చేస్తుంటారు.

కొంచెం ఆలస్యమైనా కుట్రలు, దోపిడీలు చేసిన వారి పాపం పండుతుంది. చిదంబరం 20సార్లు ముందస్తు బెయిలుతో అరెస్టు తప్పించుకున్నా చివరకు కటకటాల పాలుకాక తప్పలేదు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. వ్యవస్థలను మ్యానేజి చేయడం మునుపటంత సులువు కాదిప్పుడు.

అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపుకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, “కావాల్సిన” వాళ్లు వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసికొన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుపు.'' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?