Advertisement

Advertisement


Home > Politics - Political News

విజ‌యసాయి ఒక్క ట్వీట్‌కు మూడు పిట్ట‌లు...

విజ‌యసాయి ఒక్క ట్వీట్‌కు మూడు పిట్ట‌లు...

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న జాతీయ పార్టీ బీజేపీ గురించి ఏపీలో అధికారం చెలాయిస్తున్న వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డి తెగ బెంగ పెట్టుకున్నాడు. అది కూడా త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి టీడీపీ నుంచి జాతీయ పార్టీలోకి వ‌ల‌స వెళ్ల‌డంపై విజ‌య‌సాయి త‌న మార్క్ ట్వీట్ చేశాడు.

"ఏమీ తినడానికి దొరకని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు బీజేపీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయన్నాయని గ్రహించేలోపే, మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో ముందు ముందు చూడాలి" అని విజ‌య‌సాయి తాజా ట్వీట్ ఇటు టీడీపీలోనూ, అటు బీజేపీలోనూ కాక రేపుతోంది.

ప‌నిలో ప‌నిగా మ‌రో నాయ‌కుడిపై కూడా విజ‌య‌సాయిరెడ్డి ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించాడు. ఆయ‌న సొంత పార్టీ నాయ‌కుడ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

"అవసరాల కోసం స్వార్థంతో జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదు. మీడియా ఎంటర్టైనర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదు. పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవు" అని సుతిమెత్త హెచ్చ‌రిక కూడా చేశాడు.

ఈ వ్యాఖ్య‌లు త‌గ‌లాల్సిన వాళ్ల‌కే త‌ప్ప‌క త‌గిలి ఉంటాయి.  స్వార్థంతో జెండాలు మార్చే వారంతా లిటిగేట‌ర్ల అవ‌తారం ఎత్తుతు న్నారంటూ విజ‌య‌సాయి సొంత పార్టీలో తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్న  ప్ర‌జాప్ర‌తినిధి  గురించి చీవాట్లు పెట్టార‌ని అర్థ‌మ‌వుతోంది. అలాగే మీడియా ఎంట‌ర్‌టైన‌ర్లుగా మిగ‌ల‌డం మిన‌హా సాధించేదేమీ ఉండ‌ద‌ని అన‌డం వెనుక కూడా స‌ద‌రు నేత రోజూ ఆ లేఖ‌, ఈ లేఖ అంటూ హ‌డావుడి చేయ‌డాన్ని ప‌రోక్షంగా విజ‌య‌సాయి ఎండ‌గ‌ట్టాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

చివ‌రిగా జ‌గ‌న్‌ను ఏమీ చేయ‌లేర‌నే హెచ్చ‌రిక‌ను త‌న ట్వీట్ ద్వారా పంపిన‌ట్టైంది. మొత్తానికి విజ‌య‌సాయి ఒక్క ట్వీట్‌తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, బీజేపీతో పాటు సొంత పార్టీ అస‌మ్మ‌తి నేత‌కు గ‌ట్టిగా హిత‌వు చెప్పిన‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. 

ఇంత సక్సెస్ అస్సలు ఊహించలేదు

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?