Advertisement

Advertisement


Home > Politics - Political News

చివరికి విజయశాంతి కూడా అదే మాట!

చివరికి విజయశాంతి కూడా అదే మాట!

మా కాబోయే సీఎం కేటీఆర్..టీఆర్ఎస్ శ్రేణుల్ని ఎవర్ని కదిపినా ఇప్పుడు ఇదే మాట. ఏ క్షణానైనా కేటీఆర్, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం ఖాయం అంటున్నారు. మరీ ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆ లాంఛనం పూర్తవుతుందని కూడా బల్లగుద్ది మరీ చెబుతున్నారు. వాళ్ల పార్టీకి సంబంధించి వాళ్లు ఎన్నయినా చెప్పుకోవచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉన్న విజయశాంతి కూడా ఇప్పుడిదే చెబుతున్నారు. వాళ్లు అన్నారు.. వీళ్లు అన్నారు అంటూనే.. తన మనసులో మాట బయటపెట్టారు విజయశాంతి.

"టిఆర్ఎస్ నేతలు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెబితే దానిని ఎవరూ పట్టించుకోరు, కానీ ప్రతిపక్షాలకు చెందిన నేతలు సైతం కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చేస్తున్న ప్రచారం వల్ల ఆయన ఇమేజ్ ప్రజల్లో బాగా పెరుగుతుందనడంలో సందేహం లేదు. దీంతో కేసిఆర్ గారి కంటే, కేటీఆరే గారు మంచి ముఖ్యమంత్రి కాగలరన్న భావనతో కొంతమంది టిఆర్ఎస్ నేతలు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండవచ్చు."

చూశారుగా.. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడినా తన మనసులో మాటను పరోక్షంగా వెల్లడించారు విజయశాంతి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న విజయశాంతి.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే అంశం పూర్తిగా టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ.. చాలామంది మీడియా ప్రముఖులు తనను అడుగుతున్నారు కాబట్టి, తను తెలుసుకున్న విషయాలు చెబుతున్నానంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.

మున్సిపల్ ఎన్నికల తీరుపై కాంగ్రెస్‌కు చెందిన జిల్లా నేతలు కొంతమందిని ప్రశ్నిస్తే... గతంలో మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అధిక సీట్లను గెలుచుకునే అవకాశం ఉందంటున్నారని విజయశాంతి చెబుతున్నారు. అదే కనుక జరిగితే ఆ క్రెడిట్ ను కేటీఆర్ కే ఇవ్వాలని పరోక్షంగా చెబుతున్నారు.

ప్రస్తుతం విజయశాంతి వరస చూస్తుంటే.. ఆమె మరోసారి కేసీఆర్-కేటీఆర్ ద్వయాన్ని దువ్వుతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం టైమ్ లో టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి, గతంలో కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత రాజకీయంగా కొన్నాళ్లు స్తబ్దుగా మారి, ఇప్పుడు మరోసారి కేటీఆర్ ద్వారా కేసీఆర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

నువ్వు అనుకుంటే అవుతుంది సామి..మీ మాట ఒక శాసనం

ఈ పప్పు నాయుడి గాడికి రాజకీయా బిక్ష పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?