Advertisement

Advertisement


Home > Politics - Political News

జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి

జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి

దేశంలో రైతుల ప్రయోజనాలు పరిరక్షణ, సంక్షేమం కోసం జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటు కోసం రాజ్యాంగాన్ని సవరించాలని ప్రతిపాదిస్తూ వైఎస్సార్సీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. రైతు ప్రతినిధులతో ఏర్పాటు చేసే ఈ కమిషన్‌ రైతాంగం సంక్షేమం, సంరక్షణ కోసం చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేసేలా పర్యవేక్షించే అధికారం కూడా కమిషన్‌కు ఉంటుందని అన్నారు.

దీంతో పాటు ప్రాక్టీసు చేసే న్యాయవాదుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తగిన పథకాలకు రూపకల్పన చేయడంతోపాటు న్యాయవాదుల సామాజిక భద్రత ఫండ్‌ను నెలకొల్పేందుకు వీలు కల్పించేలా 1961 నాటి అడ్వకేట్స్‌ చట్టాన్ని సవరించాలని కోరుతూ రెండో బిల్లును ప్రవేశపెట్టారు. 

అలాగే మహిళల నుంచి  గొలుసులు, ఆభరణాలు, పర్సులు ఇతర విలువైన వస్తువులను దొంగిలించే చర్యను భారతీయ శిక్షా స్పృతిలో విస్పష్టమైన నేరంగా నిర్వచిస్తూ ఈ నేరానికి పాల్పడిన వారికి 5 నుంచి 10 ఏళ్ళపాటు కఠిన జైలు శిక్ష విధించేలా 1960 నాటి భారతీయ శిక్షా స్మృతిని సవరించాలని ప్రతిపాదిస్తూ మూడో బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. దీని వలన మహిళల నుంచి చైన్లు దొంగిలించే నేరాలను సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?