cloudfront

Advertisement


Home > Politics - Political News

మమతా బెనర్జీ సర్కార్ ను బర్తరఫ్ చేయనున్నారా?

మమతా బెనర్జీ సర్కార్ ను బర్తరఫ్ చేయనున్నారా?

పశ్చిమ బెంగాల్ లో అల్లర్లు రాజుకున్నాయి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ముగియగానే మొదలైన ఈ రచ్చలు పతాక స్థాయికి చేరాయి. భారతీయ జనతాపార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్యన జరిగిన విద్వేషదాడుల్లో ఇప్పటివరకూ పదమూడు మంది మరణించినట్టుగా అధికారిక గణాంకాలు చెబుతూ ఉన్నాయి. వారిలో ఎనిమిది మంది తమ పార్టీ కార్యకర్తలు అని మమతా బెనర్జీ గర్వంగా చెప్పుకుంటున్నారు! ఆమె లెక్కల ప్రకారం ఐదుమంది బీజేపీ వాళ్లు చనిపోయినట్టు!

ఇలా ముఖ్యమంత్రి అల్లర్లలో మరణించిన వారి నంబర్లను చెప్పుకుంటూ.. సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. అయితే ఈ తీరు మమతా బెనర్జీ ప్రభుత్వానికే చేటుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రక్షించడం అక్కడి ప్రభుత్వం బాధ్యత. ఇలా పార్టీల మధ్యన విద్వేష దాడులు మనుషుల ప్రాణాలను బలిగొనడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పార్టీల అధికారం మారినప్పుడు ప్రతీకార దాడులు జరుగుతూ ఉంటాయి. వాటికి హద్దు లేకుండా పోతోంది బెంగాల్ లో.

పశ్చిమ బెంగాల్ లో తొలిసారి భారీస్థాయిలో పాగా వేసింది భారతీయ జనతా పార్టీ. ఈ పరిణామం మమతా బెనర్జీకి ఏ మాత్రం మింగుడు పడటంలేదు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రెచ్చిపోతున్నారు. ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణాలు కోల్పుతూ ఉన్నట్టు ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు చేష్టలుడిగి చూస్తూ ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఇదేతీరు కొనసాగితే మమతా బెనర్జీ కేంద్రానికి మంచి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుందని పరిశీలకులు అంటున్నారు. శాంతి భద్రతలను కాపాడంలో వైఫల్యం చెందినందుకు గానూ మమత సర్కారను బర్తరఫ్ చేసి, బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రానికి అవకాశం ఏర్పడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?