cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఏపీకి గ్రోత్ ఇంజన్ గా విశాఖ?

ఏపీకి గ్రోత్ ఇంజన్ గా విశాఖ?

విశాఖ పరిపాలనా రాజధాని అన్న సంగతి తెలిసిందే. అంతకు ముందే విశాఖ పర్యాటక రాజధాని, సాంస్కృతిక రాజధాని, సినీ రాజధాని కూడా. అటువంటి విశాఖ ఇపుడు ఏపీకి గ్రోత్ ఇంజన్ కాబోతోందా. అంటే ఆర్ధిక నిపుణులు అవును అనే చెబుతున్నారు. 

విశాఖలో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. అంతకు మించి ప్రాకృతిక అందాలు ఎన్నో ఉన్నాయి. విశాఖను టూరిజం పరంగా అభివృద్ధి చేస్తే ఏపీకి అతి పెద్ద ఆదాయవనరుగా మారుతుంది. అసలు విశాఖ పొటెన్షియాలిటీని అన్ని రకాలుగా గుర్తించిందే జగన్. అందుకే ఆయన విశాఖ‌ రాజధాని కావాలని భావించారు.

ఇదిలా ఉంటే విశాఖ నగరంలోని రుషికొండ రిసార్ట్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీంతో రుషికొండ పైన ఉన్న 65 ఎకరాల విస్తీర్ణంలో 30 ఎకరాలల్లో టూరిజం పేరిట భారీ నిర్మాణాలను చేపడతారు.

విశాఖకు వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ నిర్మాణాలు ఉంటాయని అంటున్నారు. దాదాపుగా వందకోట్లతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు అని తెలుస్తోంది. దీనికి అనుబంధంగా మరిన్ని కార్యక్రమాల కోసం కూడా టూరిజం శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొత్తానికి విశాఖకు పర్యాటక కళ తీసుకురావ‌డానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలనూ తీసుకుంటోంది.

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×