Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇప్పుడు రక్తం పొంగడం లేదా చంద్రబాబు!

ఇప్పుడు రక్తం పొంగడం లేదా చంద్రబాబు!

రాష్ట్రాభివృద్ధిని వైసీపీ, బీజేపీ కలిసి అడ్డుకుంటున్నాయంటూ ముఖ్యమంత్రి హోదాలో ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు చంద్రబాబు. అసెంబ్లీ వేదికగా రక్తం పొంగిపోతా ఉందంటూ అర్థంపర్థం లేని డైలాగులు చెప్పారు. బాధ ఉండదాండీ అంటూ బీద అరుపులు అరిచారు. అప్పట్లో రక్తం పొంగించుకున్న చంద్రబాబు, ఇప్పుడెందుకు రక్తం పొంగిపొర్లించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు విశాఖ జనం.

విశాఖను రాజధానిగా చేయొద్దని బాహాటంగా ప్రకటన చేసిన వ్యక్తి బాబు. అవసరమైతే విశాఖ అభివృద్ధి కోసం పరిశ్రమలు స్థాపించండి తప్ప రాజధానిగా మాత్రం ప్రకటించొద్దంటూ తన స్వార్థాన్ని బయటపెట్టారు. బాబు ఇంత మాట అన్న తర్వాత అతడ్ని విశాఖ గడ్డపై అడుగుపెట్టనిస్తారా? ఈ రోజు అదే జరిగింది. విశాఖలో కపట యాత్ర చేయడానికొచ్చిన చంద్రబాబును విశాఖ వాసులు ఆదిలోనే అడ్డుకున్నారు.

విశాఖకు రాజధాని వద్దన్న చంద్రబాబును వెనక్కి వెళ్లిపొమ్మని నినదించారు విశాఖ వాసులు, వైసీపీ కార్యకర్తలు. జనం ఇంత ఛీ కొడుతున్నా చంద్రబాబుకు ఎందుకు రక్తం పొంగడం లేదని ఎద్దేవా చేశారు. చివరికి కాన్వాయ్ పై చెప్పులు, గుడ్లు వేసినా బాబుకు రక్తం పొంగలేకపోయిందని, పూర్తిగా చల్లారిన రక్తంతో బాబు రాజకీయాలకు పనికిరాకుండా పోయారని సెటైర్లు వేస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు సిగ్గుంటే, రక్తం పొంగుతుంటే మరోసారి విశాఖకు రాకూడదని డిమాండ్ చేస్తున్నారు.

జనం ఎంత ఛీ కొట్టినా చంద్రబాబు మాత్రం తన డప్పు ఆపలేదు. విశాఖ ప్రజల్ని ఓదార్చేందుకే తను వచ్చానని, తనను షూట్ చేసినా పర్యటన చేసి తీరతానంటూ కెమెరాల ముందు కలరింగ్ ఇచ్చారు. ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే కాదు, రాయలసీమలో కూడా చంద్రబాబును ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు.

చెప్పులతో చంద్రబాబుకి ఉత్తరాంధ్రుల ఘన స్వాగతం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?