Advertisement

Advertisement


Home > Politics - Political News

విశాఖ... విహంగమై విహరించు ..!

విశాఖ...  విహంగమై విహరించు ..!

విశాఖ అందమైన నగరం. ఎదురుగా తూర్పున పడగెత్తే కడలి కెరటాలు. పడమర వైపున ఎత్తైన పచ్చని కొండలు తప‌స్సు  చేస్తూ మౌన మునుల్లా దీవిస్తూ ఉంటాయి. విశాఖలో ఎటూ చూసినా పరచుకున్న పచ్చదనం కళ్ళను కట్టి పడేస్తాయి.

విశాఖ నుంచి భీమునిపట్నం వరకూ 26 కిలోమీటర్ల రోడ్డు ఉంది. ఈ రోడ్డులో కొన్ని దశాబ్దాల‌ క్రితం బస్సులు తిరగడం మొదలెట్టాయి. అప్పటికి అదే అభివృద్ధి. బస్సులో కిటికీ పక్కన కూర్చుని ఎగిసిపడే కడలి అందాలను చూస్తూ ముప్పావు గంట ప్రయాణం తెలియకుండా సేదతీరడం అంటే అదో అందమైన అనుభవం.

ఇపుడు ట్రాం రైల్ కాన్సెప్ట్ ని వైసీపీ సర్కార్ ముందుకు తెచ్చింది. విశాఖను రాజధానిగా ప్రకటించడంతోనే ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని ట్రాం రైల్ ప్రాజెక్ట్ ని పట్టలెక్కించేందుకు వైసీపీ సర్కార్ రెడీ అయింది. మరో వైపు టూరిజం స్పాట్ గా విశాఖ నుంచి భోగాపురం దాకా మొత్తం 50 కిలోమీటర్ల మేర  బీచ్ రోడ్డుని అభివృద్ధి చేద్దామని ప్రణాళికలు ఉన్నాయి.

ఇపుడు ట్రాం రైల్ భీమిలీ వరకూ నడపనున్నారు. దీనికి ప్రత్యేక ట్రాక్ అవసరం లేదు. రోడ్డు మీదనే సెన్సార్ సిగ్నల్స్ తో నడుస్తుంది. వేగం చూస్తే గంటకు డెబ్బై కిలోమీటర్లు. పెద్దగా ఖర్చు ఉండదు. మూడు కంపార్టుమెంట్స్ తో మూడు వందల మంది దాకా ప్రయాణించవచ్చు.

విశాఖ లాంటి పాతిక లక్షల జనాభా ఉన్న నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తీర్చేందుకు ట్రాం రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు.  దీన్ని తరువాత దశలో భోగాపురం దాకా పెంచాలని ప్రణాళికలు ఉన్నాయి. మొత్తానికి ట్రాం రైలు కనుక విశాఖకు వస్తే ఇక విహారమే.

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?