cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ మాజీ సీఎం..విశాఖ ఆక్టోపస్ కలలు?

జగన్ మాజీ సీఎం..విశాఖ ఆక్టోపస్ కలలు?

జగన్.. పదేళ్ళ పోరాటం తరువాత దక్కింది ముఖ్యమంత్రి పదవి. అది కూడా అరకొర మెజారిటీతో కాదు, 151 సీట్లతో 50 శాతం పైగా ఓట్ల షేర్ తో. దేశమంతా తలతిప్పి చూసేలా జగన్ ఘన విజయం సాధించారు. ఏడాది పాలన పూర్తి అయింది. ఇంకా నాలుగేళ్ళ పదవీకాలం ఉంది.

గత ఏడాది  కాలంలోనే 90 శాతం హామీలను జగన్ నెరవేర్చారు. ఇంకా అనేక కార్యక్రమాలకు  శ్రీకారం చుడుతున్నారు. ప్రజలలో సంత్రుప్తి శాతం బాగా ఉందని తాజాగా సర్వేలు చెబుతున్నాయి. పార్టీలో ఒకటి నుంచి పది వరకూ అన్నీ జగనే. అటువంటి ఎదురులేని జగన్ మాజీ సీఎం ఎలా అవుతారు.

ఎలా అవుతారు అంటే విశాఖలో ఉన్న అక్టోపస్ కలల్లో అంటున్నారు వైసీపీ నేతలు.  ఆంధ్ర ఆక్టోపస్  లగడపాటి రాజగోపాల్ జోస్యాలు అన్నీ ఫెయిల్ అయిన తరువాత కనిపించడం మానేశారు. కానీ టీడీపీకి కంచుకోట లాంటి భీమిలీ సీటు ఇచ్చినా ఓడిన విశాఖ ఆక్టోపస్ సబ్బం హరి మాత్రం వద్దన్నా జోస్యాలు చెబుతూనే ఉన్నారు. అవన్నీ కళ్ళ ముందు విఫలం అవుతున్నా ఇవాళ కాకపోతే రేపూ అంటూ దీర్ఘాలు తీస్తూ మరి జగన్ మాజీ సీఎం అనేస్తున్నారు.

ఆయన తాజాగా చెప్పిన జోస్యం భలే విచిత్రంగా  ఉంది. ఏపీలో వైసీపీ నాలుగేళ్ళ పాటు అధికారంలో ఉంటుందిట. జగన్ మాత్రం మాజీ సీఎం అవుతారట. . ఇలా జోస్యం చెబుతూనే మరో మాట అంటున్నారు విశాఖ ఆక్టోపస్. 2022 ఓ జమిలి ఎన్నికలు వస్తాయట. అపుడు వైసీపీ ఘోరంగా ఓడిపోతుందట.

ఓ వైపు నాలుగేళ్ళు వైసీపీ అధికారంలో ఉంటుందని చెబుతూనే మరో వైపు ఏపీలో వైసీపీ పవర్ మూడేళ్ళు మాత్రమే  అంటున్న సబ్బం హరి కలలు కూడా సరిగ్గా కనలేకపోతున్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తే తప్పేంటి. మొత్తానికి జగన్ మీద అక్కసుతో ఆయన జాతకాన్నే పదే పదే చూస్తున్న విశాఖ అక్టోపస్ తన గురించి, పార్టీ గురించి కూడా ఆలోచించడం మానేశారు అని వైసీపీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

 


×