Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ గన్ తీయాల్సిందేనట..?

జగన్ గన్ తీయాల్సిందేనట..?

రాష్ట్రానికే గర్వకారణం లాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం దూకుడు మీద ఉందని అఖిల పక్ష కార్మిక సంఘం నేతలు ఫైర్ అయ్యారు. జాతీయ భూమి అమ్మకపు కార్పోరేషన్ పేరిట విశాఖ స్టీల్ భూములకు ఎసరు పెట్టాలని కేంద్ర పెద్దలు చూస్తున్నారని విమర్శించారు.

విశాఖలో జరిగిన వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఏడాదికి పాతికే వేల కోట్ల టర్నోవర్ కలిగి దేశంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉక్కుని తయారు చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీద కేంద్రం  పగపట్టడం దారుణం అన్నారు.

రోజురోజుకూ ఉత్పత్తిలో కొత్త రికార్డులు సొంతం చేసుకుంటున్న నేపధ్యంలో స్టీల్ ప్లాంట్ లోని కీలకమైన బ్లాక్ ఫర్నేస్ ని మూసివేయాలని చూడడం  కంటే అన్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ ఏడాది స్టీల్ గణనీయమైన లాభాలు ఆర్జించిందని, అయినా నిర్వహణ కోసం కేంద్రం పైసా ఖర్చు పెట్టడంలేదని, ఆఖరుకు ఉక్కుకు అవసరం అయిన కోకింగ్ కోల్ ని సకాలంలో దిగుమతి చేయడంలో కూడా లేట్ చేయడం దేనికి సంకేతమని నిలదీశారు.

కేంద్రానికి ఎన్ని సార్లు మొరపెట్టుకునన స్పందన రావడంలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఉక్కు అంశమే ప్రధానంగా తాము తీసుకుని సభలో నిరసన తెలియచేస్తామని అన్నారు. ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిశ్రమలను కాపాడుకోవడానికి కేంద్రంతో యుద్ధం చేస్తున్నారని, అదే తీరున జగన్ కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు.

తామంతా జగన్ వెనక ఉంటామని, ఏపీ సత్తా ఏంటో ఢిల్లీకి చూపిద్దామని వారు పేర్కొన్నారు. మొత్తానికి ఏడాది సుదీర్ఘమైన పోరాటం తరువాత కూడా కేంద్రం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకపోవడంతో జగన్ గన్ గురి పెట్టాల్సిందే అని అఖిలపక్షం అయితే తేల్చేసింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?