cloudfront

Advertisement


Home > Politics - Political News

రాఘవేంద్రరావుకు ఓటర్ల ఝలక్.. అలిగి వెళ్లాడు!

రాఘవేంద్రరావుకు ఓటర్ల ఝలక్.. అలిగి వెళ్లాడు!

ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవికి ఇలాంటి అనుభవమే కలిగింది. పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడకుండా.. సూటిగా వెళ్లిపోయి ఓటేసే యత్నం చేసిన చిరుకు అప్పట్లో ఒక ఓటర్ ఝలక్ ఇచ్చాడు. మర్యాదగా క్యూలో రమ్మని సూటిగా కొట్టినట్టుగా చెప్పాడు. దీంతో చిరంజీవి వెళ్లి క్యూలో నిలబడక తప్పిందికాదు.

ఈసారి చిరంజీవి అభిమాన దర్శకుడు రాఘవేంద్రరావుకు అదే కథ రిపీట్ అయ్యింది. ఫిల్మ్ నగర్ బూత్ లో క్యూలో నిలబడకుండా వెళ్లి ఓటేయబోయిన ఈ దర్శకుడికి క్యూలోని జనాలు హితబోధ చేశారు. వెళ్లి క్యూలో నిలబడి ఓటు వేయమని సూచించారు. మీరు క్యూలో నిలబడి అందరికీ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి.. ఇలా దూరి ఓటేసి వెళ్లిపోదామనుకుంటే ఎట్టా? అని అక్కడి జనాలు నిలదీశారు. దీంతో అటూ ఇటూ తచ్చాడిన రాఘవేంద్రరావుకు ఇగో హర్ట్ అయినట్టుగా ఉంది.

వెళ్లి క్యూలో నిలబడటం అవమానం అనుకున్నాడో ఏమో కానీ.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. రాఘవేంద్రరావు అలిగి వెళ్లిపోయాడని కొంతమంది అంటున్నారు. ఆ బూత్ వద్దే సురేష్ బాబు చిన్నకొడుకు, వాళ్ల వాళ్లు క్యూలో నిలబడ్డారు. వాళ్లందరినీ లైన్ పక్కన క్రాస్ చేసి వచ్చిన రాఘవేంద్రరావు చివరకు వెనుదిరిగాడు. క్యూలో రమ్మనందుకు అలగడం ఏమిటో!

తెలంగాణ వోటింగ్ ఇవాలే... ముళ్లు ఎటువైపు తిరుగనుంది?