Advertisement

Advertisement


Home > Politics - Political News

తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్

తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్

తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్ పెట్టే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. పెరిగిపోతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని, ఈ అంశాన్ని వెంటనే పరిశీలించాలని చెప్పింది. దీంతోపాటు ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ వేళల్ని పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని, రోజుకు కనీసం లక్ష టెస్టులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి పలు ఆదేశాలిచ్చింది. వీటిలో ముఖ్యమైంది నిపుణుల కమిటీ. కరోనా కట్టడిపై నిపుణుల కమిటీని వేసి, ఆ వివరాల్ని సమర్పించాల్సిందిగా ఆదేశించింది. 

ఆర్టీపీసీఆర్ ఫలితాలు 24 గంటల్లోపే వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోకలపై తీసుకుంటున్న జాగ్రత్తల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.

ఓవైపు హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేస్తుంటే..మరోవైపు ప్రభుత్వం దీనికి భిన్నంగా ప్రకటన చేసింది. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పేశారు సీఎస్ సోమేష్ కుమార్. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుతోందని, లాక్ డౌన్ అవసరం లేదన్నారాయన. 

హైకోర్టు సూచించిన వీకెండ్ లాక్ డౌన్ పై పరిశీలిస్తామని చెప్పిన సీఎస్.. కరోనా సమస్యకు లాక్ డౌన్ పరిష్కారమార్గం కాదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అవసరమైనప్పుడు సీఎం, కేబినెట్ దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు.

సీఎస్ సోమేష్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగుతున్నాయి. ఓవైపు హాస్పిటల్ బెడ్స్ దొరక్క, రెమిడివిజర్ ఇంజెక్షన్లు దొరక్క రోగులు ఇబ్బందులు పడుతున్నారని, క్షేత్రస్థాయిలో సమస్యను గుర్తించాలని కోరుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?