cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఈటలకు దారేది.. తర్వాత ఏం చేయబోతున్నారు?

ఈటలకు దారేది.. తర్వాత ఏం చేయబోతున్నారు?

తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు వెళ్తారా? లేక తనకు మద్దతుగా నిలిచిన వర్గాలన్నింటినీ కలుపుకొని ఉద్యమం చేస్తారా? దీనిపై ఆసక్తికరంగా స్పందించారు రేవంత్ రెడ్డి.

ఈటలపై వేటు పడబోతోందనే విషయాన్ని అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కేబినెట్ లోని కొంతమంది కీలకమైన వ్యక్తులు తనకు ఈ విషయాన్ని చెప్పారని, త్వరలోనే ఈటల తన మంత్రి పదవి కోల్పోతారని రేవంత్ రెడ్డి ప్రకటించిన వారం రోజులకే.. ఈటల పదవి పోయింది. ఇప్పుడు ఈటల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుందనేది కూడా చెబుతున్నారు రేవంత్.

తెలంగాణలోని బీసీల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న వర్గం ముదిరాజ్. ఈ కమ్యూనిటీకి చెందిన నేతకు పరాభవం జరిగింది కాబట్టి.. ఈటల ఈ కోణంలో ఆందోళనను లేవనెత్తొచ్చని చెబుతున్నారు. 50శాతం బీసీల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నది ముదిరాజ్ లేనని, వాళ్లందర్నీ ఒక్కటి చేస్తే ఈటల ఉద్యమం సక్సెస్ అవుతుందని అంటున్నారు రేవంత్.

"తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తులందర్నీ కేసీఆర్ ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడీ శక్తులన్నింటినీ ఈటల ఒకటి చేయాలి. తెలంగాణ ఉద్యమం టైమ్ లో ఎలాగైతే కలిశారో అలా భేషజాలు పక్కనపెట్టి మరోసారి కలవాలి. ఈ నలుగురు చేతుల నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యతను ఈటల అందుకోవాలి"

కేసీఆర్ ప్రస్తుతం చాలా శక్తిమంతంగా తయారయ్యారని అంటున్నారు రేవంత్. గతంలో కేసీఆర్ వెంట ఆయన కులం లేదని, ఇప్పుడు ఆయన కులనాయకుడయ్యారని.. ఇక డబ్బు విషయానికొస్తే లారీలు కూడా పట్టనంత డబ్బు వెనకేసుకున్నాడని అన్నారు. ఇలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఈటలకు సూచన చేశారు రేవంత్. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×