cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మండలి రద్దు?.. రేపు ఏది జరిగినా బాబు ఓడినట్టే

రేపు కేబినెట్ మీటింగ్, ఆ వెంటనే అసెంబ్లీ సమావేశం. టైమ్ దగ్గరపడే కొద్దీ టీడీపీలో, ముఖ్యంగా చంద్రబాబులో టెన్షన్ మరీ ఎక్కువవుతోంది. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు ఓడినట్టే లెక్క. మండలి రద్దుకి కేబినెట్ సిఫార్సు చేస్తే లోకేష్ తో సహా టీడీపీకి ఉన్న ఎమ్మెల్సీలంతా మాజీలుగా మిగిలిపోతారు. అది చంద్రబాబుకి ఘోర అవమానం. 

ఇక మండలిని కొనసాగించాలని నిర్ణయించినా చంద్రబాబే ఓడిపోతారు. మూడు రాజధానుల బిల్లు వ్యవహారం సెలక్ట్ కమిటీకి వెళ్లిందని అనుకున్నా, కాస్త ఆలస్యంగానైనా బిల్లు చట్టరూపం దాల్చడం ఖాయం. దీంతో చాలామంది టీడీపీ ఎమ్మెల్సీలలో అంతర్మథనం మొదలైంది. బిల్లుని అడ్డుకున్న పేరు పోతే పోయింది, కనీసం ఎమ్మెల్సీ పదవైనా దక్కితే చాలు అని మెజార్టీ సభ్యుల అభిప్రాయం. పోనీ అడ్డుకుంటే ఏమైనా ఒరుగుతుందా అంటే అదీ లేదు, మళ్లీ మూడు నెలల తర్వాత మండలితో సంబంధం లేకుండానే బిల్లుని చట్టంగా మార్చుకోగల సత్తా శాసన సభకు ఉంది. అంత మాత్రానికే పదవులు ఊడగొట్టుకోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు. 

అందుకే మండలిలో బిల్లుకి మద్దతిచ్చేవారి సంఖ్య పెరుగుతోంది,  చైర్మన్ తో సహా. ఈరోజు టీడీఎల్పీ సమావేశానికి ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడంతోనే అసలు విషయం ఏంటనేది అర్థమౌతోంది. సో.. ఈ దశలో మండలిని రద్దు చేసే ఆలోచన జగన్ విరమించుకున్నా బిల్లు పాసవుతుంది, బాబు మొహం మాడిపోతుంది. అయితే తాజా రాజకీయ పరిణామాలు గమనిస్తే, శాసనమండలి రద్దు వైపే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే శాసనమండలిలో అడ్డంకి అనేది వికేంద్రీకరణ బిల్లుతో ఆగిపోదు. రాబోయే రోజుల్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా, మండలిలో ఇదే పరిస్థితి వస్తుంది. అందుకే మొత్తంగా మండలినే రద్దుచేస్తే ఓ పనైపోతుందని భావిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. కొద్దిసేపటి కిందట మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. 

ఎమ్మెల్సీలతో టచ్ లో ఉన్నామని, వాళ్లకు డబ్బు ఆఫర్ చేశామంటూ చంద్రబాబు మీడియా ఇస్తున్న కథనాల్ని బొత్స ఖండించారు. గతంలో చంద్రబాబు చేసినలాంటి రాజకీయాలు తాము చేయమన్నారు. అయినా ఎమ్మెల్సీలకు డబ్బు ఆఫర్ చేయడానికి బాబు దగ్గర ఉన్నంత అవినీతి సొమ్ము తమ వద్ద లేదన్నారు. ఎమ్మెల్సీలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం తమకు లేదని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్సీలు బిల్లుకు మద్దతుగా నిలుస్తారని, మరీ ఇబ్బంది ఎదురైతే ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసంటూ హెచ్చరికలు జారీచేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. రేపు మండలి రద్దు ఖాయంగా కనిపిస్తోంది.

రామోజీరావుని సూటిగా అడుగుతున్నా