Advertisement

Advertisement


Home > Politics - Political News

పోలవరం.. ఏం జరిగింది? ఏం జరుగుతోంది?

పోలవరం.. ఏం జరిగింది? ఏం జరుగుతోంది?

పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడిలాంటిది. అలాంటి ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో చందబాబు ప్రభుత్వం  పూర్తిగా విఫలమయ్యింది. ఐదేళ్ళకాలంలో పోలవరంలో చంద్రబాబు చేసినపని శూన్యం. చంద్రబాబు పోలవరాన్ని ఒక ఆదాయ వనరుగా వాడుకున్నారు తప్ప పూర్తిచేయానే సంకల్పంతో ఏరోజు పని చేయలేదని స్పష్టం అవుతోంది. ప్రాజెక్ట్ పనులను దక్కించుకున్న సంస్థలు కూడా పనులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో తాజాగా ఏపి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాత కాంట్రాక్ట్ను రద్దుచేసి మళ్లీ టెండర్లు (రివర్స్ టెండరింగ్) పిలవడంతో పోలవరం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నిర్మాణ, మౌళిక వసతుల రంగాలు తిరోగమనంలో ఉన్నాయని అటువంటి పనులు చేపట్టే సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోగా ప్రతీకూల పరిస్థితు ఎదురవుతున్నాయంటూ ఓ వైపు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది పోలవరం పరిస్థితి. 2004లోనే అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించినా తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కొనసాగించలేకపోయింది. 2018 డిసెంబర్ నాటికే పోలవరం ప్రాజెక్ట్ను పూర్తిచేసి గ్రావిటీ కెనాల్ ద్వారా సాగు, తాగు నీరు అందిస్తామని సాక్షాత్తూ నాటి నీటిపారుదల శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దాన్ని చేతల్లో చూపించడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపాదికన చేసిన కనీసం రెండేళ్ళ సమయం పడుతుంది పోలవరం పూర్తవ్వడానికి.

పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధానమైనవి జలాశయ నిర్మాణంతో పాటు జల విద్యుత్ కేంద్రం. దీనిని సాంకేతిక భాషలో ఎర్త్ కమ్ ర్యాక్ఫిల్ డ్యామ్ (ఈసిఆర్ఎఫ్) అని పిుస్తారు. 2009లో ఈ పనులకు టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు ఆ ధరకు గిట్టుబాటు కావని ఎవరూ ముందుకు రాలేదు. 2012లో నాటి ప్రభుత్వం టెండర్లు పిలవగా ట్రాన్స్ ట్రాయ్ పాటు మరికొన్ని సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో తక్కువ ధరకు పనులు చేపట్టాయి. ఆ తరువాత ఆ సంస్థల దివాళా తీయడంతో అందులో కొంత పనిని తప్పించి వేరే సంస్థలకు గత ప్రభుత్వం అప్పగించింది. ఆ తరువాత మరో రెండు సంస్థలకు కూడా మరికొన్ని పనులను అప్పగించారు. కాంట్రాక్ట్ రద్దు అయ్యే నాటికి మొత్తం మూడు సంస్థలు పనులను చేస్తుండేవి.

జల విద్యుత్ కేంద్రం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా 2017 జనవరి 9న టెండర్లు పిలవగా సంస్థలను ఖరారు చేసి ఒప్పందం కుదుర్చుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. 2017 డిసెంబర్ 20న ఒప్పందం కుదుర్చుకుని 322 కోట్లు అడ్వాన్స్ చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్ట్లోని స్పిల్వే ఛానెల్తో పాటు ర్యాక్ఫిల్ డ్యామ్, కాఫర్ డ్యామ్, గేట్ల బిగింపు, జల విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో రద్దుచేసింది. రెండేళ్లలో ప్రాజెక్ట్ను పూర్తి చేయాంటే అన్ని పనులను ఒకే ప్యాకేజీ క్రింద ఒకే కాంట్రాక్టర్కు అప్పగించాలనే కమిటీ సూచన మేరకు ప్రభుత్వం తాజాగా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో టెంటర్లు పిలిచింది.

మొత్తం 13 రకాల అనుమతులు అవసరం కాగా అందులో 10 అనుమతులు వైయస్ పాలనలోనే లభించాయి. కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులులు, స్థల, జాతీయ వన్యప్రాణి, గిరిజన మంత్రిత్వశాఖ నుంచి ఆర్ఆర్ఆర్ అనుమతులు, సుప్రీంకోర్ట్ నుంచి పాపికొండల అభయారణ్య స్థల మార్పిడి, కేంద్ర జలసంఘం నుంచి టీఏసి, ప్లానింగ్ కమీషన్ నుంచి పెట్టుబడి వ్యయం, అటవీ, పర్యావరణ శాఖ నుంచి తుది అనుమతులు మొదలైనవి 2005 నుంచి 2009 మధ్య కాలంలో లభించాయి.

చంద్రబాబు పాలనలో అంటే 2017, 2019ల్లో టీఏసి రేస్ టూ, సవరించిన అంచనాలు అనుమతులు మాత్రమే లభించాయి. దీనిని బట్టి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన కీలకమైన అనుమతులు సాధించడంలో చంద్రబాబు చేసిందేమీ లేదు. అంతా నాటి ముఖ్యమంత్రి (దివంగత) వైయస్ రాజశేఖరరెడ్డి కాలంలోనే సాధ్యమైందనే విషయంపై స్పష్టత వస్తుంది.

బాహుబలి' ఇంకా కలగానే ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?