cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

త‌బ్లిగీ లోప‌ల ఏం జ‌రిగింది? బీబీసీ షాకింగ్ క‌థ‌నం!

త‌బ్లిగీ లోప‌ల ఏం జ‌రిగింది? బీబీసీ షాకింగ్ క‌థ‌నం!

పేరుకు ప్ర‌పంచ వ్యాప్తంగా దానికి నెట్ వ‌ర్క్ ఉంది. అయితే ఢిల్లీలో నిజాముద్ధీన్ ప్రాంతంలో దానికి ఉన్న‌ది చాలా చిన్న మ‌సీదే. ఆ మ‌ర్క‌ద్(కేంద్రం)లో వేల మంది ముస్లింలను ప్రార్థ‌న‌ల పేరుతో పెట్టారు త‌బ్లిగీ జ‌మాత్ నిర్వాహ‌కులు. ముస్లింలో ఈ త‌బ్లిగీ పాలోయ‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంది. దీనికి అంత‌ర్జాతీయంగా శాఖ‌లున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న కొంద‌రు ముస్లిం ప్ర‌ముఖులు ఈ త‌బ్లిగీ జ‌మాత్ ఫాలోయ‌ర్లే. వీరిలో ఇంజ‌మామూల్ హ‌క్ వంటి పాకిస్తాన్ క్రికెట‌ర్లు కూడా ఉన్నారు. త‌బ్లిగీ కి వివిధ దేశాల్లో శాఖ‌లున్నాయి. ముస్లింల‌ను మంచి ముస్లింలుగా తీర్చిదిద్ద‌డ‌మే త‌న ల‌క్ష్యం అని త‌బ్లిగీ ప్ర‌క‌టించుకుంటూ ఉంది. దీనికి వందేళ్ల నేప‌థ్యం ఉంద‌ట‌. 

ఇలా భార‌త‌దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తికి కేంద్రంగా నిలిచిన త‌బ్లిగీ జ‌మాత్ మ‌ర్క‌ద్ గురించి బీబీసీ వివిధ క‌థ‌నాల‌ను ఇచ్చింది. క‌రోనా వైర‌స్ విష‌యంలో ప్రొడ్యూస‌ర్లు చైనా వాళ్లు అయితే,  డిస్ట్రిబ్యూట‌ర్లు ముస్లింలు అనే సోష‌ల్ మీడియా పోస్టును ఒక క‌థ‌నంలో బీబీసీ ప్ర‌స్తావించింది.

ఇక త‌బ్లిగీ  అంత‌ర్భాగంలో ఏం జ‌రిగింద‌నే విష‌యం గురించి కూడా బీబీసీ ఒక క‌థ‌నంలో పేర్కొంది. అక్క‌డకు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ముస్లింల‌ను ర‌ప్పించుకున్నారు. విదేశాల వారి చేత వారికి మ‌తోప‌దేశాలు చేశారు. ఇక వారికి లంచ్ లు, డిన్న‌ర్ లు అన్నీ అక్క‌డే. అక్క‌డే ఉంది అస‌లు క‌థ‌. ముస్లింలు ఇలాంటి ప్రార్థ‌న‌ల్లో నాన్ వెజ్ త‌ప్ప‌నిస‌రి, అక్క‌డున్న వేల మందికి అక్క‌డే వండారు. పెద్ద పెద్ద అండాల్లో బిరియానీలు చేసుకున్నారు. అయితే తినే ప‌ద్ధ‌తి మ‌రింత షాకింగ్.

బారాత్ ల‌లో(పెద్ద పెద్ద ప్లేట్లు) బిరియానీ పెట్టుకుతిన్నారు. అయితే ఒక్కోరికి ఒక ప్లేటు కాదు, ఒక పెద్ద ప్లేట్లో బిరియానీ పెట్ట‌డం.. ఒక బ్యాచ్ వ‌చ్చి తింటుంది. ఆ ప్లేట్ చుట్టూ ఏ ప‌ది మందో కూర్చుని తింటారు. ఆ బ్యాచ్ లేవ‌గానే మ‌రో బ్యాచ్ అదే ప్లేట్ ద‌గ్గ‌ర కూర్చుంటుంది. మ‌ధ్య‌లో దాన్ని క‌డిగేది ఏమీ ఉండ‌దు. మ‌ళ్లీ అదే బారాత్ లోకి వ‌డ్డిస్తారు. తినేవాళ్లు కూర్చుంటారు, తిన్నాకా లేస్తారు.. ప్లేట్ అదే, క‌డిగేది ఉండ‌దు, అందులోకే వ‌డ్డ‌న‌!

ఇక తిన్న వాడు చేయి క‌డుక్కోవ‌డానికి వెళ్ల‌డానికి కూడా క్యూలో వేచి ఉండాల్సిందే. అక్క‌డే తిన‌డం, ప‌క్క‌నే క‌డ‌గ‌డం. ఇక బాత్ రూమ్ కు వెళ్లాలన్నా క్యూల్లో వేచి ఉండాల్సిందేన‌ట‌! ఒక చిన్న మ‌సీదు నిర్మాణంలో కొన్ని వేల మందిని ఉంచారు. అక్క‌డ‌కు విదేశాల నుంచి క‌రోనాను అంటించుకుని వ‌చ్చిన వారిని తెచ్చారు. అందుకే అక్క‌డ వైర‌స్ కు విచ్చ‌ల‌విడిగా అంటుకుంది. ఇదీ ఆ మ‌ర్క‌జ్ లో ప‌రిస్థితి గురించి బీబీసీ ఇచ్చిన వివ‌రాలు. త‌బ్లిగీ వెళ్లొచ్చిన వారిలో ఎందుకు క‌రోనా అధిక‌స్థాయిలో ఉంది. 

అక్క‌డ‌కు వెళ్లి వ‌చ్చిన వారిలో ఇప్ప‌టి వ‌ర‌కూ 30, 40 శాతం మందిలో క‌రోనా వైర‌స్ ను గుర్తించిన‌ట్టుగా ఉన్నారు. మ‌రీ ఆ స్థాయిలో ఎందుకు ప్ర‌బ‌లింది? అంటే.. అందుకు మ‌సీదులో ఏ మాత్రం నీట్ నెస్ లేకుండా, మ‌త‌మౌడ్యంలో అనాగ‌రికంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లనే.. అంత‌లా క‌రోనా వైర‌స్ వ్యాపించింద‌ని స్ప‌ష్టం అవుతూ ఉంది. ఇంత‌క‌న్నా దుర్మార్గం ఏమిటంటే.. ఆ మ‌ర్క‌జ్ ప్ర‌బోధ‌కుడు ఒక‌రు మ‌రింత దారుణమైన మాట‌లు మాట్లాడాడు అట‌. 

ఏ వైర‌స్ రాద‌ని, మ‌సీదుల్లో చ‌చ్చిపోయినా పుణ్య‌మే అని చెప్పాడ‌ట‌. అలాంటి చావు కోరుకునే వాళ్లు అక్క‌డే చావాల్సింది. బ‌య‌ట‌కు వ‌చ్చి అంద‌రినీ భ‌యాందోళ‌న‌ల్లోకి ముంచెత్త‌డ‌మే క్ష‌మార్హం కానిది. అయితే అన్ని క‌బుర్లు చెప్పిన ఆ ప్ర‌బోధ‌కుడు ఇప్పుడు మాత్రం త‌ను క్వారెంటైన్ లో ఉన్న‌ట్టుగా, పోలీసుల ముందుకు వ‌చ్చేది లేద‌ని అంటున్నాడ‌ట‌. త‌ను ఎక్క‌డున్న‌ది కూడా అత‌డి కుటుంబ స‌భ్యులు కూడా చెప్ప‌డం లేద‌ట‌.

మనమంతా ఒక్కటే అని చాటుదాం