Advertisement

Advertisement


Home > Politics - Political News

ప్రభుత్వం వద్దంటోంది.. ఈరోజు కోర్టు ఏం చేస్తుంది?

ప్రభుత్వం వద్దంటోంది.. ఈరోజు కోర్టు ఏం చేస్తుంది?

ఆర్టీసీ సమ్మెపై పీటముడి వీడలేదు. ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ నుంచి, అసలు చర్చలకు పిలిస్తే చాలనే డిమాండ్ కు ఆర్టీసీ కార్మికులు దిగినప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో వరుసగా 45వ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెలు, నిరాహార దీక్షలు చేయబోతున్నారు.

ఆర్టీసీ చరిత్రలో ఇంత సుదీర్ఘంగా సమ్మె జరిగిన సందర్భాల్లేవు. అంతేకాదు, ఇప్పట్లో ఈ సమ్మె వ్యవహారం కొలిక్కి వచ్చేలా కూడా కనిపించడం లేదు. చర్చల కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు సూచిస్తే, ఆ సూచనను కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది. సమ్మె లేబర్ కోర్టులో ఉన్నందున, కమిటీ అవసరం లేదని వాదిస్తోంది. పైగా సమ్మె పూర్తి చట్టవిరుద్ధమని మరోసారి కోర్టుకు ఈరోజు విన్నవించబోతోంది.

ఓవైపు కార్మికులు ఓ మెట్టు దిగినప్పటికీ, ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో ఈరోజు హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా కమిటీకి కూడా ప్రభుత్వం నో చెప్పడంతో ఈ సమస్య మరింత జటిలంగా మారింది. అటు కోర్టు కూడా ఈ సమస్యపై తన అసహాయతను వ్యక్తంచేసింది. దీనిపై నేరుగా ఆదేశాలివ్వలేమని, చర్చల కోసం మంచి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం మాత్రం చేస్తామని చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.

ఆర్టీసి ఆస్తులు, అప్పులపై విచారణ ప్రారంభించిన హైకోర్టు ఇప్పుడా అంశాన్ని పూర్తిగా వదిలేసింది. చర్చలకు ప్రభుత్వం అంగీకరిస్తే అదే చాలనే భావనలో పడిపోయింది. మరోవైపు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి, ప్రైవేటు బస్సులకు పర్మిట్ల అంశాన్ని కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్టీసీని సగం ప్రైవేటీకరిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరే అవకాశం ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?