
ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాగుతూ ఉంది. అనేక ట్విస్టుల అనంతరం ఎట్టకేలకూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ముందు రోజు వరకూ పోలింగ్ ఉంటుందా? ఉండదా? అనే ఉత్కంఠత కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఏపీలో ఈ స్థానిక ఎన్నికల ప్రక్రియ సాగుతూ ఉంది.
ఆ సంగతలా ఉంటే.. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. తమకు నచ్చని ఎన్నికల కమిషనర్ వచ్చాకా టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది. అయితే అప్పటికే నామినేషన్లు దాఖలై ఉండటంతో.. టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నట్టా, లేనట్టా అనేది క్లారిటీ లేని అంశమే.
మరోవైపు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బహిష్కరణ పిలుపును పట్టించుకోకుండా అనేక మంది టీడీపీ నేతలు తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీలో ఉందంటూ ప్రకటించుకున్నారు. ఇలా చంద్రబాబు పిలుపుకు సొంత పార్టీ వాళ్లే విలువ ఇవ్వని పరిస్థితి నెలకొంది.
అదలా ఉంటే.. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన బహిష్కరణ పిలుపు మేరకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించే వారు ఓటింగ్ కు దూరంగా ఉండాల్సి ఉంది.
తమకు పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం ఓటింగ్ దక్కిందని చంద్రబాబు నాయుడు ఆ మధ్య ప్రకటించుకున్నారు. అంటే వారంతా చంద్రబాబు తీరును సమర్థించే వాళ్లు, సీఎం జగన్ తీరును వ్యతిరేకించేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలింగ్ ను బహిష్కరించినట్టుగా ప్రకటించారు కాబట్టి.. ఆయన లెక్క ప్రకారం వారంతా కూడా ఓటింగ్ కు దూరంగా ఉండాలి.
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 30 శాతం ఓటింగ్ లభించింది. కనీసం ఆ శాతం మేరకు అయినా ప్రజలు ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలి. చంద్రబాబు పిలుపు ప్రభావం ఆ మాత్రం అయినా ఉండాలి!
ఒకవేళ ఈ ఎన్నికల్లో ఏ యాభై శాతానికి మించి, అరవై శాతం వరకూ పోలింగ్ నమోదైతే మాత్రం టీడీపీ అధినేత పిలుపు ప్రభావం శూన్యమే అని చెప్పక తప్పదు. చంద్రబాబు ఇచ్చిన బహిష్కరణ పిలుపును ప్రజలెవ్వరూ లెక్క చేయనట్టే అని అప్పుడు స్పష్టత వస్తుంది.
చంద్రబాబు పిలుపుకు విలువనిచ్చేవాళ్లంతా నేటి పోలింగ్ కు దూరంగా ఉంటారు. అలా కాకుండా మెరుగైన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయితే మాత్రం..చంద్రబాబు పిలుపును ఎవ్వరూ ఖాతరు చేయలేదని స్పష్టం అవుతుంది. ఈ ఎన్నికల బహిష్కరణ పిలుపుతో తెలుగుదేశం పార్టీ అధినేత సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయాలే సర్వత్రా వినిపిస్తున్నాయి.
చంద్రబాబు చెప్పినా తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారంటూ పలువురు టీడీపీ నేతలు ప్రకటించడమే చంద్రబాబు నాయకత్వ వైఫల్యానికి పెద్ద రుజువు. ఆ పై ఇప్పుడు పోలింగ్ శాతం కూడా గట్టిగా నమోదైతే.. చంద్రబాబును ఏపీ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరరించినట్టుగా అవుతుంది.
పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా
నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను