cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఈ విజ‌యం ఏ రాజ్యాంగానిది?

ఈ విజ‌యం ఏ రాజ్యాంగానిది?

ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు హైకోర్టు డివిజ‌న్ బెంచ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు మ‌రికొన్ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు స‌మాధానాలు చెప్పాల్సి ఉంది. ఇంత‌కూ ప్ర‌శ్న ఏంటంటే...ఈ విజ‌యం ఎవ‌రి ఖాతాలో వేయాలో చెప్పాల్సి ఉంది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై నిన్న హైకోర్టు సింగిల్ జ‌డ్జి బ్రేక్ వేయ‌డంతో టీడీపీ, బీజేపీ, సీపీఐ, జ‌న‌సేన నేత‌లు సంబ‌రాలు చేసుకున్నారు. ఇదేదో తుది తీర్పు అన్న‌ట్టుగా పెద్ద‌పెద్ద మాట‌లే మాట్లాడారు.

ముందుగా చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే ...ఇది అంబేద్క‌ర్ రాజ్యాంగ విజ‌యంగా అభివ‌ర్ణించారు. ఈ మేరకు ఆయ‌న విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఏమున్న‌దంటే...

"ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను న్యాయ‌స్థానం నిలుపుద‌ల చేయ‌డం అంబేద్క‌ర్ రాజ్యాంగ విజ‌యం. చ‌ట్ట విరుద్ధ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తూ తెలుగుదేశం తీసుకున్న నిర్ణ‌యం స‌రైందేన‌ని కోర్టు తీర్పుతో రుజువైంది" అని ఆయ‌న పేర్కొన్నారు. మ‌రి డివిజ‌న్ బెంచ్ అదే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల‌ను కొట్టివేస్తూ ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంపై చంద్ర‌బాబు స్పంద‌న ఏంటి?

ఎన్నిక‌ల‌ను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అంబేద్క‌ర్ రాజ్యాంగ విజ‌య‌మైతే, మ‌రి డివిజ‌న్ బెంచ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఏ రాజ్యాంగం విజ‌య‌మో చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల్సి ఉంది. అలాగే ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తూ త‌మ నిర్ణ‌యం త‌ప్ప‌ని ఆయ‌న అంగీక‌రించిన‌ట్టేనా? ఇంత‌కూ ఇది రాజారెడ్డి రాజ్యాంగ విజ‌య‌మ‌ని బాబు చెప్ప‌ద‌లుచుకున్నారా? ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికి బాబు ఆన్స‌ర్ ఇచ్చి తీరాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు తానేమీ త‌క్కువ తిన‌లేద‌ని నిరూపించుకున్నారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల నిలుపుద‌ల అనంత‌రం వీర్రాజు వీర్రావేశంతో చేసిన ట్వీట్ ఏంటో చూద్దాం.

"ప‌రిష‌త్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నాం. ఇది జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి భారీ దెబ్బ‌. రాష్ట్ర ప్ర‌భుత్వ యంత్రాంగాల దుర్వినియోగాన్ని బ‌హిర్గ‌తం చేస్తూ ప‌రిష‌త్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను హైకోర్టు నిలిపివేసింది" అని సోము వీర్రాజు పేర్కొన్నారు. తాజా డివిజ‌న్ బెంచ్ తీర్పును బీజేపీ వ్య‌తిరేకిస్తున్న‌దా? ఇది కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి భారీ దెబ్బే అని చెబుతుందా?

ఇక జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అంటే విమ‌ర్శ‌లు చేసేందుకు సీపీఐ ఒంటికాలిపై నిలిచి ఉంటుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప‌రిష‌త్ ఎన్నిక‌ల నిలుపుదల తీర్పు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు, ఆయ‌న ప్ర‌భుత్వానికి చెంప పెట్టు అని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అన్నారు. మ‌రి నేటి డివిజ‌న్ తీర్పు ఎవ‌రికి చెంప‌పెట్టో నారాయ‌ణ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

నిన్న ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను నిలిపేసింది సింగిల్ జ‌డ్జి అనే స్పృహే లేకుండా, అంతా ఏదో జ‌రిగిపోయింద‌న్న అత్యుత్సాహంతో నోరు పారేసుకున్న వివిధ పార్టీల ప్ర‌ముఖుల‌కు అదే హైకోర్టు డివిజ‌న్ బెంచ్ చెంప ప‌గ‌ల‌గొట్టేలా తీర్పు వెలువ‌రించింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అతి మంచిది కాద‌ని క‌నీస ఇలాంటి తీర్పుల‌తోనైనా రాజ‌కీయ నాయ‌కుల‌కు జ్ఞానోద‌యం అయితే మంచిది.  

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×