Advertisement

Advertisement


Home > Politics - Political News

బీజేపీకి ఓట్లేయరేంటని ఫీల్ అవుతున్న ఎంపీ గారు ?

బీజేపీకి ఓట్లేయరేంటని ఫీల్ అవుతున్న ఎంపీ గారు ?

ఓట్లకు రాజకీయ నాయకులకు మధ్య సంబంధం నీటికి చేపకు ఉన్న బంధం లాంటిది. ఎన్ని పాట్లు పడినా ఫీట్లు చేసినా ఓట్ల కోసమే కదా. అలాంటిది ఏపీలో జనాలు బీజేపీకి  ఎందుకు ఓటేయరూ. ఇది ఎవరికో సాదా సీదా మనిషికి కలిగే సందేహం కాదు. ఏపీ బీజేపీకి పెద్ద దిక్కు, పెద్దల సభలో  ఆ పార్టీ ఎంపీ జీవీఎల్  నరసింహారావు కి వచ్చిన డౌట్.

మేము ఎన్నో మంచి పనులు చేశాము, ఏపీకి కేంద్రం ఎన్నో రకాలుగా సాయం చేస్తోంది. దండీగా నిధులు ఇస్తున్నాం. అయినా జనాలు ఎందుకు ఆదరించడంలేదు అని ఆయన వాపోతున్నారు. 

నిజమే ఏపీకి కేంద్రం నిధులు ఇస్తోంది కానీ అవి అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగానే ఇస్తోంది తప్ప అడ్డగోలు విభజనతో పూర్తిగా నష్టపోయి చితికిపోయిన ఏపీకి  ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదు.

ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరం విషయంలో ఎన్నో రకాలుగా కొర్రీలు పెడుతున్నారు. మరో వైపు చూస్తే విభజన హామీలకు దిక్కు లేదు. ఇవన్నీ జనాలకు కోపానికి కారణం. 

మరి ఏపీకి హోదాతో సహా ఇవ్వాల్సినవి ఇచ్చేస్తే జనాలు నెత్తిన పెట్టుకుంటారు కదా. అలా రాజ మార్గం వదిలేసి ఏపీకి ఎంతో చేశామని చిట్టా పద్దుల  లెక్కలు చెబుతూంటే సగటు జనం వింటారా. అయినా వారికి అర్ధం కాని రాజకీయం ఏదైనా ఉంటుందా. మొత్తానికి బీజేపీ బాధ అలా ఉంది అనుకోవాలేమో.

రైతు గొప్పతనమే ఇతివృత్తంగా శ్రీకారం సినిమా

ఆర్కే నాయుడు క్యారెక్ట‌ర్ ని ఎవ‌రూ రీప్లేస్ చేయ‌లేరు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?