cloudfront

Advertisement


Home > Politics - Political News

ఇప్పుడు రుణం తీర్చుకోవడం ఏమిటి రెడ్డిగారూ!

ఇప్పుడు రుణం తీర్చుకోవడం ఏమిటి రెడ్డిగారూ!

తెలంగాణలో తమ పార్టీ పది ఎంపీ సీట్లను నెగ్గుతుందని ప్రకటించారు తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పదిహేడు ఎంపీ సీట్లకు గానూ పది సీట్లలో తమదే విజయం అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రెడ్డిగారి విశ్వాసాన్ని అభినందించవచ్చు.

మరి వారి విజయానికి కారణాలు ఏమిటో.. ఆయన చెప్పిన తీరే కొంచెం విశేషంగా ఉంది. 'తెలంగాణను ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు కృతజ్ఞతతో ఉన్నారు, సోనియాగాంధీ రుణాన్ని తీర్చుకోవడానికి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారు..' అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ గెలుస్తుందని అనడం వరకూ బాగానే ఉంది కానీ, ఇప్పుడు తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకున్నారు అనడమే కాస్త హాస్యాస్పదంగా ఉంది. అదెందుకో చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు అంతగా రుణపడి ఉంటే.. రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనే కాంగ్రెస్ ను గెలిపించాల్సింది.

ఆ తర్వాత జరిగిన వివిధ ఉప ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ వాళ్లు రుణం తీర్చుకోవాలనే ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక కొన్ని నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా 'రుణం తీర్చుకోవడం..' అనే అన్నారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బోల్తా పడింది. చిత్తుగా ఓడింది.

అప్పుడంతా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పట్ల గుర్తుకు రాని 'రుణం' ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందని అంటారు? జస్ట్ డౌట్ అంతే!

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!