Advertisement

Advertisement


Home > Politics - Political News

అధికారులపై ఎగిరిపడితే ఏమొస్తుంది బాబూ.!

అధికారులపై ఎగిరిపడితే ఏమొస్తుంది బాబూ.!

నిన్న విశాఖపట్నంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘షో’ అభాసుపాలయ్యింది. ఏ విశాఖపట్నం విమానాశ్రయంలో అయితే రన్‌ వే మీదనే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుందో, ఏ విశాఖపట్నం విమానాశ్రయంలో అయితే అప్పటి ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగిందే.. ఆ విశాఖపట్నం విమానాశ్రయం ప్రస్తుత ప్రతిపక్ష నేతకి షాకిచ్చింది.

అప్పట్లో పోలీసులు అప్పటి అధికార పక్షానికి సహకరించారు. ఇప్పుడు పోలీసులు ఇప్పటి అధికారపక్షానికి సహకరిస్తున్నారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అధికారుల మీద అప్పట్లో వైసీపీ అసహనం వ్యక్తం చేసింది, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నారు. ‘అధికారుల మీద చిందులేస్తారా.?’ అంటూ అప్పట్లో చంద్రబాబు అండ్‌ కో, వైసీపీ మీద విరుచుకుపడిన విషయం విదితమే.

ఇక, చంద్రబాబు అధికారుల మీద గుస్సా అవుతున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఓ పోలీస్‌ అధికారి మీద రుసరుసలాడుతూ, కింద కూర్చున్న చంద్రబాబు అమాంతం పైకి లేచే ప్రయత్నం చేశారు. అదీ రోడ్డు మీద వ్యవహారం. ఇంకోపక్క, వీఐపీ లాంజ్‌లోనూ అధికారులపై చంద్రబాబు తనదైన స్టయిల్లో విరుచుకుపడిపోయారు. ఏదో హడావిడి చేయాలని కాకపోతే, అక్కడ ఏం జరుగుతోందో చంద్రబాబుకి తెలియదా.? గతంలో అధికారుల్ని తాను ఎలా వాడుకున్నదీ చంద్రబాబుకి గుర్తుండదా.?

ఏ చట్టం కింద తనను అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ చంద్రబాబు నానా యాగీ చేశారు. నిజానికి, అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ప్రీ ప్లాన్డ్‌గా చంద్రబాబుని అడ్డుకున్నారన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. పోలీసులు, అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయారన్నదీ నిర్వివాదాంశం. మరి, నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే చంద్రబాబు, సంయమనంతో వ్యవహరించాలా.? వద్దా.?

దాదాపు నాలుగైదు గంటలపాటు అలాగే రోడ్డు మీదే చంద్రబాబు వుండిపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.! అనుమతిచ్చి, చంద్రబాబు పర్యటనకి సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. కానీ, చంద్రబాబు చేసిందేంటి.? సమస్య మరీ జరిÄలంగా మారినప్పుడు తన అనుభవాన్ని ఉపయోగించి, సమస్య సద్దుమణిగేలా చేయగలగాలి. కానీ, అంత హుందాతనం చంద్రబాబుకెక్కడిది.?

ఇలాంటి విషయాల్ని పొలిటికల్‌గా ఎలా తనకు మేలు జరుగుతుందనే కోణంలోనే డీల్‌ చేస్తారు చంద్రబాబు. ఇక్కడా అదే చేశారు. అయితే, చంద్రబాబు కోరుకున్న స్థాయిలో ఆయనకు పొలిటికల్‌ మైలేజ్‌ వచ్చిందా.? లేదా.? అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం.

దేన్నీ ఎవరూ ఆపలేరు 

పోలవరం ప్రాజెక్ట్ స్పీడ్ పెంచిన వైఎస్ జగన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?